ఏపీ సీఎం జగన్‌కు దళిత సామాజిక వర్గాల నుంచి సూటి ప్రశ్న తెరమీదికి వచ్చింది. “మీరు ఇచ్చిన హామీ.. ఏమైంది సార్?” అంటూ వారు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఒక్క దళితులే కాదు.. మేధావుల నుంచి కూడా ఈ ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇప్పుడు దళితులు నిలదీస్తున్నారు? ఏంటి ప్రత్యేకత? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. రాజధాని అమరావతిలోని ఐనవోలు గ్రామంలో గతంలో చంద్రబాబు ఏర్పాటు చేయాలని సంకల్పించిన ‘అంబేడ్కర్ స్మృతి వనం’ను జగన్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో.. రాజధాని పరిధిలోని ఐనవోలు గ్రామంలో చంద్రబాబు అంబేడ్కర్ స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14, 2016న దాదాపు 126 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా.. ఆయన ప్లాన్ చేసుకుని ఇదే విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి పాతిక కోట్లు ఇచ్చారు. అయితే.. ఇంతలోనే చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయారు. ఇక, జగన్ వచ్చిన తర్వాత.. గత ఏడాది ఈ స్మృతి వనాన్ని రద్దు చేశారు. అది కూడా అంబేడ్కర్ జయంతి రోజే నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో గత ఏడాది ఏప్రిల్ 14న వైసీపీ అధినేత సీఎం జగన్.. ప్రకటన మేరకు విజయవాడ నడి బొడ్డున పీడబ్ల్యుడీ గ్రౌండ్‌లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని.. మంత్రి పినిపే విశ్వరూప్ ప్రకటించారు.
అంతేకాదు.. హుటాహుటిన.. శంకుస్థాపన కూడా చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న(అంటే.. 2021, ఏప్రిల్ 14) అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని.. ఆనాడు వైసీపీ అధినేత స్వయంగా ప్రకటించారు. కానీ, ఇది పూర్తిగా విఫలమైంది. పీడబ్ల్యుడీగ్రౌండ్ లో వివాదాస్పద ప్రాంతంలో నిర్మాణం సాగిస్తున్నారని కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో ఈ పనులు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో దళితులు, మేదావులు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. “ఏమైంది జగన్?” అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కురిపించారు.
ఏదైనా చెడగొట్టడం.. పడగొట్టడం తేలికేనని.. నిర్మించడమే కష్టమని కూడా వ్యాఖ్యలు సందించారు. అంబేడ్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ అంబేడ్కర్‌కు నివాళి అయితే.. అర్పించారు కానీ, విజయవాడలో తాము ఇదే రోజు ప్రారంభిస్తామని చెప్పిన అంబేడ్కర్ పార్క్‌పై మాత్రం ఒక్కమాట ఎత్తకపోవడం గమనార్హం. మరి దీనిని ఏమంటారో.. ఆయనే చెప్పాలని అంటున్నారు మేధావులుసైతం. మరి వైసీపీ నేతలు ఏం చెబుతారో చూడాలి.
This post was last modified on April 15, 2021 7:11 am
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…