పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో ఏం జరుగుతోంది ? అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటి ? వచ్చే ఎన్నికల నాటికైనా అధికారం లోకి వస్తుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ రాజకీయ నేతల మధ్య హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకు డు.. మాదాసు గంగాధరం ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఇది ఎక్కడైనా సహజమే. నచ్చని పరిస్థితుల నేపథ్యంలో ఏ నేతైనా.. సదరు పార్టీకి రాజీనామా సమర్పించడం ఎక్కడైనా ఉన్నదే. గతంలోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా జనసేన పార్టీకి రిజైన్ చేశారు. సో.. ఇప్పుడు జరిగింది కూడా ఇదే బాపతు అని సరిపెట్టుకోవచ్చు.
కానీ.. పోతూ పోతూ.. ఆ నాడు.. జేడీ లక్ష్మీనారాయణ, ఇప్పుడు మాదాసు గంగాధరం కూడా కొన్ని కీలక ప్రశ్నలు మిగిల్చారు. రాజకీయ తెరమీదకి ఆయా ప్రశ్నలను సంధించారు. దీంతో ఇప్పుడు అసలు జనసేనలో ఏం జరుగుతోంది? ఎందుకు నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు? అసలు పార్టీలో ఎవరూ చేరకపోగా.. ఉన్నవారిని కూడా పవన్ ఎందుకు నిలబెట్టుకోలేక పోతున్నారు..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ పార్టీ తీరు, తెన్నులు చూస్తుంటే జనసేన అసలు రాజకీయ పార్టీగా నిలదొక్కుకుంటుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి.
ఇక అనేకానేక ఆన్సర్లు లేని ప్రశ్నలు కూడా జనసేన కనీసం వచ్చే ఎన్నికల నాటికి అయినా పుంజుకుంటుందా ? అన్న సందేహాలు మేథావులు లేవనెత్తుతున్నారు. ఇప్పటివరకూ పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి పెట్టలేదు.. అన్ని స్థాయిల్లో పార్టీకి కమిటీలు వేయలేదు. ఇవి ఎప్పటకి పూర్తవుతాయో ? తెలియదు. ఇక పార్టీ సభ్యత్వం, గ్రామ కమిటీల ఏర్పాటు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో క్రియాశీల సభ్యత్వం ఎలా చేయిస్తారో తెలియడం లేదు. ఇక ఇప్పటకీ పార్టీ విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. పవన్ పోటీ చేసిన గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ఉందా లేదా ? అన్నదానిపై ఇప్పటకీ సరైన క్లారిటీ లేదు.
సినిమా ప్రపంచం వేరు.. రాజకీయ ప్రపంచం వేరు. దీనిపై సమాధానం లేదు.. సీనియర్లు పవన్‌తో కలిసి పని చేయలేని పరిస్థితి ఉంది. జనసేన ఓ రాజకీయ పార్టీగా పని చేయడం లేదన్న విమర్శలకు పవన్ ఇప్పటకీ ఆన్సర్ చేయలేకపోతున్నారు. పార్టీలో ఒక్కరికి మినహా మిగతా వ్యక్తులకు విలువ లేకుండా చేశారన్న టాక్ ఉండనే ఉంది. మరి వీటిని పవన్ సమాధానం ఏం చేబుతారో చూడాలి. వీటిని పవన్ రివైజ్ చేసుకుని రియలైజ్ అయితేనే జనసేనకు కనీసం వచ్చే ఎన్నికల నాటికి అయినా భవిష్యత్తు ఉంటుంది.
This post was last modified on April 13, 2021 10:14 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…