వైఎస్. జగన్ ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్ పార్టీ పెట్టి సీఎం అయ్యే వరకు కష్టపడిన వారిలో ఎంతో మంది ఉన్నారు. వీరందరి కంటే ఎక్కువ కష్టపడ్డారు జగన్ చెల్లి షర్మిల, తల్లి విజయలక్ష్మి.
షర్మిల పార్టీ కోసం చేసిన సేవ చెప్పలేనిది.. వెలకట్టలేనిది. ఆమె అన్న జైలులో ఉన్నప్పుడు సుధీర్ఘంగా పాదయాత్ర చేశారు. 2014 ఎన్నికల్లో కడప లేదా ఖమ్మం ఎంపీ సీటు ఆశించినా చెల్లికి ఎంపీ సీటు ఇవ్వడం సుతరాము ఇష్టంలేని జగన్ తల్లి విజయలక్ష్మికి వైజాగ్ ఎంపీ సీటు ఇచ్చి పరోక్షంగా చెక్ పెట్టేశారు. తల్లికి ఎంపీ సీటు ఇవ్వడంతో షర్మిల అడగలేకపోయారు.
ఇక గత ఎన్నికల ప్రచారంలో కూడా బైబై బాబు అన్న నినాదంతో అన్నను సీఎం చేసేందుకు బాగా కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటు ఆశించిన ఆమెకు జగన్ షాక్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చార కనీసం రాజ్యసభ ఇస్తారనుకుంటే అసలు షర్మిల పేరు కూడా వినపడడం లేదు. జగన్‌ను సీఎం చేసేందుకు ముందు పార్టీలో ఎంతో మంది పేర్లు వినిపించాయి. ఇప్పుడు జగన్ పేరు తప్ప ఎవ్వరి పేరు వినపడడం లేదు. జగన్ తప్ప ఎవ్వరూ కనపడడం లేదు. అయితే ఇటీవల జగన్ సతీమణి వైఎస్. భారతి మాత్రం వార్తల్లో నిలుస్తున్నారు.
భారతికి రాజకీయాల్లో రాణించాలన్న కాంక్ష ఉందా ? లేదా ? అన్నది తెలియదు కాని.. జగన్ ఏ పరిస్థితుల్లో అయినా సీఎం పీఠం నుంచి తప్పుకుంటే ఆప్షన్ మాత్రం భారతియే అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎవ్వరూ సందేహం కూడా వ్యక్తం చేయలేని పరిస్థితి. ఒక వేళ ఇప్పుడు ఉన్న అనేక సందేహాల నేపథ్యంలో జగన్ జైలుకే వెళ్ళాల్సి వస్తే కూడా భారతి తప్ప మరో ఆప్షన్ కూడా జగన్‌కు, వైసీపీకి లేదు. జగన్ స్థానంలో ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఎవరికి అయినా ఉన్నా… ఆ ఛాన్స్ జగన్ ఇవ్వను కూడా ఇవ్వడు. జగన్ తర్వాత రెండో ఆప్షన్‌గా ఏ నేత పేరు పైకి రాకుండా జగన్ జాగ్రత్త పడ్డారు.
ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి అనేకానేక నేతలు పోటీ పడుతున్నారు. జగన్ ప్రచారంలో లేరు. ఒక్కరంటే ఒక్క స్టార్ క్యాంపెయినర్ కూడా వైసీపీలో లేరు. ఈ లోటు కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మరోవైపు చంద్రబాబు, లోకేష్ ప్రచారంలో తెగ తిరుగుతున్నారు. ఇలాంటి టైంలో షర్మిల ఉంటే వైసీపీకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండేది. ఇప్పుడు షర్మిల కొత్త పార్టీ పెట్టుకున్న నేపథ్యంలో ఇక భారతి పూర్తి స్థాయి రాజకీయ రంగంలోకి దిగక తప్పదని.. జగన్‌కు ఆమె రైట్ హ్యాండ్‌గా ఉంటేనే జగన్‌పై ఒత్తిడి తగ్గుతుందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి భారతి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో ? చూడాలి.
This post was last modified on April 12, 2021 8:27 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…