తన పక్షం కాకుంటే.. ఒకలా ? తన పక్షంలో చేరితే ఒకలా మారిపోయే రాజకీయాలు ఇప్పుడు కొత్తకాదు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఏం చేసినా తప్పులుగా చూసే.. అధికార పక్షం.. వారే అధికార పక్షానికి కొమ్ము కాస్తే.. మాత్రం ఆ తప్పులు కూడా ఒప్పులు అయిపోవడం ఖాయం. రాజకీయాల్లో ఇదో అంటు వ్యాధి మాదిరిగా మారిపో యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యర్థి పార్టీల నేతలపై ఉన్న వివాదాలను, కేసులను, వారి సమస్యలను కూడా అధికార పక్షం తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలే ఉండొద్దన్నట్టుగా కూడా వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో జరిగిన విషయాన్నే తీసుకుంటే.. ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును టీఆర్ఎస్‌లో కలిపేసుకుని.. టీడీఎల్పీని విలీనం చేసుకున్నట్టు ప్రకటించారు. అయితే. వీరయ్య.. గతంలో స్టీఫెన్ సన్ కేసులో అంటే.. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే (స్టీఫెన్‌సన్) ఓటు కోసం.. డబ్బు లు ఇవ్వ జూపారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి 2015లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ కేసులోనే అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారనే పేరు వినిపించింది.
ఈ కేసు ఇలా సాగుతున్న క్రమంలోనే రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఉన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. ఇక, చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఏకంగా మకాం మార్చారు. ఇక, వెంకట వీరయ్య.. గత ఎన్నికల్లో గెలిచే వరకు టీడీపీలో ఉన్నా.. పరోక్షంగా కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవ హరిస్తున్నారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ నేరుగా ఈయనను పార్టీలోకి చేర్చుకున్నారు. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఓటుకు నోటు కేసును ఉపేక్షించేది లేదని.. నిందితులు ఎంతవారైనా కోర్టుకు ఈడుస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఇప్పుడు అదే కేసులో నిందితులుగా ఉన్న వీరయ్యను తన పార్టీలోకి చేర్చు కోవడం.
ఇక ఈ కేసు ఎంత సీరియస్‌గా ఉందంటే.. వీరయ్య ఇటీవల డిశ్చార్జ్ పిటిషన్ వేసినా.. ఏసీబీ కోర్టు తోసిపు చ్చింది. అంటే.. ఏసీబీ కోర్టు.. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విభాగమే తప్పు చేసినట్టు తేల్చగా.. ఇప్పుడు ఈ కేసును తేల్చేస్తాను..అన్న కేసీఆర్.. ఇలా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. తనకు చాలినంత బలం ఉన్నప్పటికీ.. ఇలా చేయడం కేసీఆర్ రెండునాల్కల ధోరణికి నిదర్శనమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 10, 2021 10:53 am
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…