దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల శుక్రవారం నిర్వహించ నున్న ఖమ్మం సభ హాట్ టాపిక్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షర్మిల సభకు సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం సభకు రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో షర్మిల ఉత్సాహంగా బయలు దేరారు. అయితే.. ముందస్తుగా నిర్ణయించుకున్న సమయానికి సభ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. ఆమె నేరుగా సభకు రాకుండా.. దారిలో ఆగుతూ.. ప్రజలను పలకరించేలా ప్లాన్ చేసుకున్నారు.
200లోపే కార్లు..
వాస్తవానికి ఆదిలో వెయ్యి కార్లతో కాన్వాయ్ ఉంటుందని భావించాని.. రెండు వందల కార్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. వరుస సెలవులు రావడంతో.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొంటూ.. కేవలం 200 కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ నుంచి కాన్వాయ్‌తో బయల్దేరిన షర్మిలకు ఈ పరిణామం కూడా ఒకింత చిరాకు తెప్పించిందని అంటున్నారు.
మండకొడి ప్రయాణం
ప్రస్తుతం ఉదయం 11 గంటలకు దాటే సరికి ఎల్బీనగర్, అబ్దుల్లాపుర్ మెట్ వంటి ప్రాంతాలకు మాత్రమే ఆమె చేరుకున్నారు. ఇంకా అక్కడ నుంచి దాదాపు 170 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం.. షర్మిల సాయంత్రం 4 గంటలకు ఖమ్మం పరిసరాలకు చేరాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు మధ్య మధ్య ఆగుతూ సాగుతుండడంతో సభ అనుకున్న సమయానికి జరిగే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అయితే.. కాన్వాయ్ మందకొడిగానే ముందుకు సాగుతుండడం గమనార్హం.
షర్మిలకు ఆదిలోనే నిరాశ
ఇక, షర్మిల ఆశించిన విధంగా కూడా తెలంగాణ ప్రజలు జోరుగా ఎక్కడా కనిపించకపోవడం మరో సెట్ బ్యాక్. వైఎస్ అభిమానులు మాత్రమే రోడ్ల మీదకు వచ్చి.. షర్మిలను పలకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా సెటిర్లలో కొందరు మాత్రమే షర్మిలకు అభివాదం చెబుతున్న వారిలో కనిపించారు. ఏతావాతా ఎలా చూసినా.. తెలంగాణ ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించకపోవడం గమనార్హం. మరి.. సభ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on April 9, 2021 1:59 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…