పరిషత్ ఎన్నికలకు హైకోర్టు ఎందుకు బ్రేకులు వేసిందో అధికారపార్టీ నేతలకు అర్ధం కావటంలేదు. ప్రతిపక్షాలేమో రెండు అంశాలపై కోర్టులో కేసులు వేశాయి. ఏడాది క్రితం నోటిఫికేషన్ను రద్దుచేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నది మొదటి అంశం. ఇక రెండోదేమో ఎన్నికల నోటిఫికేషన్ కు నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలన్న సుప్రింకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదన్నది.
అయితే ఈ రెండు అంశాలను పరిశీలించిన హైకోర్టు పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చేసింది. ఇదే సమయంలో సుప్రింకోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనంటు ఎన్నికల ప్రక్రియపై స్టే ఇచ్చింది. మొదటి అంశంలో అందరికీ క్లారిటి వచ్చేసింది. అయితే రెండో అంశంపై కోర్టు ఆదేశాలే అర్ధం కావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాత నోటిఫికేషన్ తోనే ఎన్నికలు జరుగుతాయని హైకోర్టే స్పష్టంగా తేల్చేసినపుడు ఇక నాలుగు వారాల సమయం అన్న ప్రశ్నే తలెత్తదు కదా.
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న సమయంలోనే నీలం సాహ్నీ ఓ మాటన్నారు. పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన నీలం పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల ప్రక్రియను తాను కంటిన్యు చేస్తున్నట్లు మాత్రమే చెప్పారు. అంటే అప్పట్లో పరిషత్ ఎన్నికలు ఎక్కడయితే ఆగిపోయాయో అక్కడి నుండే తాను కంటిన్యు చేస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు.
సో, నోటిఫికేషన్ కొత్తది కానపుడు నాలుగు వారాల వ్యవధి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. పాత నోటిఫికేషన్ తోనే ఎన్నికలు పెట్టాలని హైకోర్టే ఒకవైపు స్పష్టం చేసి మరోవైపు నాలుగు వారాల వ్యవధి లేదని చెప్పి ఎన్నికలకు బ్రేకు వేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తున్నట్లు ప్రకటించింది. కాబట్టి డివిజన్ బెంచ్ ఏమి చెబుతుందో చూద్దాం.
This post was last modified on April 7, 2021 11:07 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…