మళ్లీ అధికారంలోకి రావాలి. మళ్లీ పెత్తనం చలాయించాలి. బీజేపీ సిద్ధాంతాలను, ఆర్ ఎస్ ఎస్ హిందూ జాలాన్నీ దేశం మొత్తం పులమాలి! -ఇదీ ఇప్పుడు ఘనత వహించిన కేంద్రంలోని బీజేపీ పెద్దలు చేస్తున్న ఆలోచన. మరి దీనికి ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? ఇప్పటికే రెండో టెర్మ్‌లో అధికారంలోకి వచ్చిన మోడీపై దేశవ్యాప్తంగా చాలా వ్యతిరేకత ఉంది. రాష్ట్రాలకు ఏమీ చేయడం లేదని.. పైగా ఉన్న అధికారాలను కూడా తీసేస్తున్నారని.. ముఖ్యమంత్రులు(బీజేపీ యేతర రాష్ట్రాలు) గగ్గోలు పెడుతున్నారు. నిధులు ఇవ్వడం లేదని.. ఏపీ సహా తెలంగాణ వంటి రాష్ట్రాలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి ఏకపక్షంగా విజయం దక్కించుకోవడం అంటే.. బీజేపీకి మాటలు కాదు.
పోనీ.. అలాగని చూస్తూ.. ఊరుకుంటారా? కానేకాదు. ఏకపక్షంగా 300 సీట్లు దక్కించుకుని మూడోసారి ముచ్చటగా కేంద్రంలో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా కార్పొరేట్ శక్తులను నమ్ముకుంటున్నారని అంటున్నారు మేధావులు. దేశంలోని కీలకమైన ప్రభుత్వం సంస్థలను కార్పొరేట్లకు పప్పుబెల్లాల మాదిరిగా పందేరం చేసి.. తక్కువ ధరలకు ధారాదత్తం చేసేసి.. తద్వారా కోట్లకు కోట్లు పార్టీ ఫండ్ సేకరించి.. దానిని ఎన్నికలకు మళ్లించి ఓట్లు కొనేసి.. అధికార పీఠం ఎక్కేసేలా బీజేపీ పావులు కదుపుతోందనే టాక్ మేధావి వర్గాల నుంచి జోరుగా వినిపిస్తోంది.
తాజాగా ఓ ఛానెల్‌లో జరిగిన చర్చలో ముగ్గురు కీలక మేధావులు పాల్గొన్నారు. వీరిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఒకరు. మరో ప్రొఫెసర్ పాల్గొన్నారు. వారు పలు కీలక అంశాలను లేవనెత్తారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ ప్రధానంగా తీసుకుంది.. ఇక్కడ కనుక బీజేపీ గెలిచి.. మమత ఓడిపోతే.. కేంద్రంలో పరిణామాలు హుటాహుటిన మారిపోవడం ఖాయం. అంటే.. వాస్తవానికి 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరాన్ని.. ముందుకు తీసుకువచ్చి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. లేదా తాము జపిస్తున్న జమిలినైనా తెరమీదికి తేవచ్చు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల కొనుగోలుకు వేల కోట్ల రూపాయల సొమ్ములు అవసరం.
దీనిని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు సంస్థలను మార్కెట్‌లో పెట్టి..నష్టాల
ముసుగు కప్పి.. ప్రైవేటు పరం చేసేసి.. తద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు విశాఖ ఉక్కునే తీసుకుంటే.. దీని స్థిర, చరాస్తుల విలువ 2.5 లక్షల కోట్ల రూపాయలు. కానీ, కేంద్ర ప్రభుత్వం పోస్కో.. సంస్థకు దీనిని 32 వేల కోట్లకు గుండుగుత్తుగా అమ్మేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రామాయపట్నంలో ఆదాని కంపెనీ పాగా వేసింది. ఇప్పుడు విశాఖ స్టీల్‌ను పోస్కోకు ఇచ్చేస్తే.. ఇంత తక్కువ ధరకే దానిని దక్కించుకున్న పోస్కో.. బీజేపీకి అన్ని విధాలా రుణ పడి ఉంటుంది. ఎందుకంటే.. దానికి రెండు లక్షల 15 వేల కోట్ల రూపాయల లాభం ప్రత్యక్షంగా వచ్చేసింది.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మాకు 30 వేల కోట్లు ఇవ్వండి అని బీజేపీ శాసిస్తే.. పువ్వుల్లో పెట్టి ఇచ్చేందుకు రెడీ ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సొమ్మును ఎన్నికలకు మళ్లించి.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్లాన్ చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఇది రాజకీయ నైతిక ఎలా అవుతుంది? ప‌్రజాస్వామ్య విలువలు ఉంటాయా? అంటే.. అడిగేవారేరీ? ఎవరికి వారు ఏదో ఒక కేసులో.. ఏదో ఒక అవినీతిలో కూరుకుపోయారు. దీంతో వీరు సీబీఐకి, ఈడీకి ఒణికి పోతున్నారు. సో.. వీరి వీక్‌నెస్ బీజేపీకి వరంగా మారింది. సో.. ఈ పరిస్థితులు, పరిణామాలను లెక్కలు వేసుకున్న బీజేపీ నాయకులు.. 300 సీట్ల కోసం.. 30 కోట్లు ఇచ్చే సంస్థను ఎంచుకుని విశాఖ ఉక్కును ధారాదత్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. మరి ఇదే నిజమైతే.. దేశాన్ని కాపాడేదెవరు? ప్రజాస్వామ్యాన్ని రక్షించేదెవరు?
This post was last modified on April 6, 2021 7:41 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…