Political News

ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పవా ?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పేట్లు లేదు. పోలింగ్ పై కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దెబ్బ పడేట్లు అనుమానంగా ఉంది. దీంతో పాటు మండే ఎండల ప్రభావం కూడా తప్పదనే అనిపిస్తోంది. మామూలుగానే తిరుపతిలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఈసారి ఎండల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాంతో పోలింగుకు ఓటర్లు ఏ మేరకు వస్తారనేది కాస్త అనుమానంగా తయారైంది.

మొన్నటి ఎన్నికల్లో పోలింగ్ శాతం 79 గా నమోదైంది. అదే పోలింగ్ శాతం ఇపుడు రిపీటవుతుందా ? అన్నదే సందేహం. దీనికంటే ప్రధానంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ జనాలను భయపెడుతోంది. ఎండలంటే ఏదోలా మ్యానేజ్ చేయవచ్చనుకునే జనాలు కూడా కరోనా వైరస్ దెబ్బకు ఆందోళనపడుతున్నారు. కరోనా తీవ్రత కూడా రోజు అంతకంతకు పెరిగిపోతోంది. శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 1398 మంది కరోనా బారిన పడగా 6 మంది చనిపోయారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న జిల్లాల్లో చిత్తూరు కూడా ఒకటి. జిల్లాలో తిరుపతి మొదటిస్ధానంలో నిలుస్తోంది. దీనికి కారణం ఏమిటంటే అంతర్జాతీయస్ధాయిలో  తిరుపతి మహా పుణ్యక్షేత్రంగా పేరు గడించటమే. శ్రీవారి దర్శనం కోసం ప్రపంచంలోని నలుమూలల నుండి భక్తులు పెద్దఎత్తున ప్రతిరోజు తిరుమలకు వస్తుంటారు. వీరంతా తిరుపతి మీదుగానే తిరుమల చేరుకుంటారు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు తిరుపతిలో ఫ్లోటింగ్ జనాభా 2 లక్షలుంటుంది. అందుకనే జిల్లాలో తిరుపతిలో కరోనా సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది.

తిరుపతి తర్వాత కరోనా సమస్య ఎక్కువగా ఉండేది శ్రీకాళహస్తిలోనే. శ్రీ కాళహస్తి కూడా ప్రముఖ పుణ్యక్షేత్రమే. తిరుపతికి వచ్చిన  భక్తుల్లో  మెజారిటి శ్రీకాళహస్తిలోని ముక్కంటిని దర్శించుకునే వెళతారు. కాబట్టే అక్కడ కూడా కరోనా వైరస్ సమస్య ఎక్కువగానే ఉంది. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికపై కరోనా ప్రభావం ఎక్కువగానే పడుతుందని అంచనా వేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on April 5, 2021 2:17 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

49 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

2 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

3 hours ago