దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువుగా ఆకర్షిస్తోన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. 2016 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 ఎంపీ సీట్లను గెలుచుకుని సంచలనం క్రియేట్ చేసింది. ఇక ఇదే ఊపుతో మమతా బెనర్జీని ఎలాగైనా ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ఆరు నెలలుగా మమత వర్సెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. ఇక బీజేపీ బెంగాల్లో గెలిచిపోతోందంటూ కూడా ఓ వర్గం జాతీయ మీడియా పెద్ద ఎత్తున హైప్ తెస్తోంది.
తాజా సమాచారం ప్రకారం బెంగాల్లో బీజేపీ సీన్ రివర్స్ అవుతోన్న పరిస్థితే కనిపిస్తోంది. స్వల్ప కాలంలోనే మారిన అనేక పరిణామాలు మరోసారి అక్కడ మమతకు పట్టం కట్టబెడుతున్నాయని తెలుస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్లు కలిసి పోటీ చేస్తున్నారు. అంచనాలకు మించి కాంగ్రెస్ + కమ్యూనిస్టుల కూటమి పుంజుకున్నట్టు తెలుస్తోంది. అయితే వీరు విజయం సాధించకపోయినా పలు చోట్ల బలమైన, మంచి పేరున్న అభ్యర్థులను నిలబెట్టడంతో వారు చీల్చే ఓట్లు బీజేపీని దెబ్బ కొట్టబోతున్నాయట.
తొలి రెండు దశల పోలింగ్ ఇప్పటికే ముగిసింది. అయితే బీజేపీ ఈ రెండు దశలపైనే ఎక్కువుగా ఆశలు పెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ రెండు దశల్లో మొత్తం 60 సీట్లకు ఎన్నికలు జరగగా.. ఇక్కడ 90 శాతం సీట్లు గెలుచుకుంటామని ముందు నుంచి ధీమాతో ఉంది. అంతే కాకుండా నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోబోతోందంటూ బీజేపీ అతి ప్రచారం కూడా స్టార్ట్ చేసింది. కానీ వాస్తవంగా తెలుస్తోన్న సమాచారంతో పాటు పలు తెలుగు సర్వేల్లో బెంగాల్ల సీన్ మారినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మమతకు ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీల మద్దతు ఉంది. ముస్లింల ఓటు బ్యాంక్ ఎప్పటకీ మమతదే. ఇప్పుడు వీరితో పాటు ఓబీసీలు కూడా మమత వైపు టర్న్ అయినట్టు తెలుస్తోంది. ఇక బెంగాల్ మహిళా సమాజం వన్‌సైడ్‌గా మమతకే ఓట్లేయబోతున్నట్టు అక్కడ ట్రెండ్స్ చెపుతున్నాయి. మహిళలు మమతను వదులుకునేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేరని అక్కడ పల్స్ చెప్పేస్తున్నాయ్..! ఇక మమత పోటీ చేసిన నందిగ్రామ్‌లో ఆమె 25- 30 వేల మెజార్టీతో విజయం సాధించబోతున్నారంటూ సమాచారం. ఇక మొత్తం ఎనిమిది దశల్లో జరుగుతోన్న ఎన్నికల్లో బెంగాల్లో భారీ మార్పు కనపడుతోందని… తృణమూల్ 170కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతోందంటూ వీరు చెపుతున్నారు.
ఇక డ్యామ్ ష్యూర్‌గా అధికారంలోకి వస్తామని బీరాలు పోతోన్న బీజేపీ 90 – 100 సీట్లలోపు మాత్రమే పరిమితమవుతుందని మెజార్టీ సర్వేలు చెపుతున్నాయి. ఏదేమైనా బెంగాల్లో మమత కోట బద్దలు కొట్టేస్తున్నామని చెపుతోన్న బీజేపీకి ఫలితాలు తేడా వస్తే జాతీయ స్థాయిలో పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది.
This post was last modified on %s = human-readable time difference 11:34 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…