Political News

అమ్మేద్దామనుకుంటే.. భారీ లాభాన్ని తెచ్చి మోడీ సర్కారుకు షాకిచ్చారు


ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలన్న నిర్ణయంపై ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలు సైతం ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక నేత.. మంత్రి కేటీఆర్ అయితే.. విశాఖ ఉక్కు అమ్మకంపై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. అధినేత కేసీఆర్ అనుమతి తీసుకొని ఆందోళనలో పాల్గొంటామని.. ఏపీకి వెళతామని చెప్పి సంచలనంగా మారారు.

కేంద్రం తీసుకున్న అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ నిరసనను పట్టించుకోని కేంద్రం మాత్రం తాను అనుకున్నట్లే విశాఖ ఉక్కును అమ్మేయాలన్న పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించుకునేలా విశాఖ ఉక్కు కార్మికులు పని తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జపాన్ లో ఏదైనా అంశంపై ఆందోళన చేయాలంటే..పని మానేసే బదులు మరింత ఎక్కువగా పని చేస్తారు. రెట్టింపు ఫలితాన్నినమోదు చేస్తారు.

తాజాగా విశాఖ ఉక్కు ఉద్యోగులు ఇదే సూత్రాన్ని పాటించారు. విశాఖ ఉక్కు చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్లుగా భారీ టర్నోవర్ ను నమోదు చేశారు. ఓవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. గడిచిన యాభై రోజులుగా కార్మికులు షిప్టుల వారీగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణ ఆగాలంటే సంస్థను భారీ లాభాల బాట పట్టించాలన్న పట్టుదలతో ఉన్న వారు విపరీతంగా పని చేస్తున్నారు. దీంతో.. మార్చి ఒక్క నెలలో 7.11లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించారు. దీంతో రూ.3300 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని తొలిసారి సాధించినట్లు సంస్థ సీఎండీ వెల్లడించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగుల్ని.. కార్మికుల్ని అభినందించారు. నష్టాల బూచి చూపించి సంస్థను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలని చూస్తున్న వేళ.. అందుకు భిన్నంగా లాభాల బాటలో నడిచేలా సంస్థను తీసుకొస్తున్న కార్మికుల తీరుతోకేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోటీన్ కు భిన్నంగా వచ్చిన తాజా ఫలితం మోడీ సర్కారుకు షాకింగ్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on April 2, 2021 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

1 hour ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

2 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

2 hours ago

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

4 hours ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

4 hours ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

5 hours ago