ఏపీ తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తు వేసింది. తాము అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికార వైసీపీ నేతలు దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుందన్న ఆరోపణల్ని తరచూ చేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వాలంటీర్లను పంపి బెదిరింపులు.. దౌర్జన్యాలకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని తరచూ చెప్పటమే కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్దగా బయటకు రాని పరిస్థితి. దీంతో.. కొత్త ఆఫర్ ను ప్రకటించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.
తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో వాలంటీర్ల దౌర్జన్యాల్ని.. బెదిరింపుల్ని రికార్డు చేసి పంపితే.. ఒక్కో వీడియోకు రూ.10వేలు చొప్పున పారితోషికాన్ని ఇస్తామని ప్రకటించారు. వాలంటీర్లు ఎవరైనా అధికార పార్టీకి ఓటు వేయాలని.. లేదంటే సంక్షేమ పథకాల్ని నిలిపివేస్తామంటూ బెదిరిస్తే ధైర్యంగా రికార్డు చేయాలని కోరారు. అలా రికార్డు చేసిన వాటిని 75575 57744కు పంపాలని కోరారు.
వాటిని తాము కేంద్ర ఎన్నికల కమిషన్ ద్రష్టికి తీసుకెళతామని.. వాలంటీర్లకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. వీడియోల్ని పంపిన వారి వివరాల్ని రహస్యంగా ఉంచుతామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు.. అలా వీడియోలు పంపే వారి అకౌంట్లకు రూ.10వేల పారితోషికాన్ని పంపుతామని చెప్పారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని వారు ఎవరైనా సరే.. వాట్సాప్ లో సమాచారం పంపితే.. అకౌంట్ కు రూ.10వేల చొప్పున పంపుతామన్నారు. మరి.. అచ్చెన్న పిలుపునకు స్పందన ఎంతలా ఉంటుందో చూడాలి.
This post was last modified on March 30, 2021 11:42 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…