విజయవాడ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన దివంగత కాపు నేత వంగవీటి రంగా వారసుడిగా అరంగేట్రం చేసిన వంగవీటి రాధా.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత.. ఆయన రాజకీయంగా చేసిన తప్పులు కావొచ్చు.. లేదా.. వేసిన అడుగులు కావొచ్చు.. ఆయనకు రాజకీయ ఫ్యూచర్ లేకుండా చేశాయనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు ? ఎక్కడ ఉన్నారు ? అనే విజయవాడలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే.. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో రాధా హవా పెద్దగా ఎక్కడా కనిపించలేదు.
వాస్తవానికి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీలో పెద్ద గందరగోళమే జరిగింది. ఎంపీ వర్సెస్ ఇతర నేతలు రోడ్డెక్కారు. ఈ క్రమంలో రాధా ఎక్కడా బయటకురాకపోవడం గమనార్హం. సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అప్పట్లో కొందరు చెప్పినా.. ఆదిశగా కూడా రాధా ఎక్కడా దృష్టి పెట్టలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు రాధా పేరుకూడా ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. దీంతో రాధాను పార్టీనే దూరం పెట్టిందా? లేక రాధానే దూరమయ్యారా? అనే చర్చ కూడా కొన్ని రోజులు సాగింది. ఏదైతేనేం.. పార్టీ విజయవాడలో కార్పొరేషన్‌ను దక్కించుకోలేక పోయింది.
ఇదిలావుంటే. ఇప్పుడు రాధా పొలిటికల్ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై ఎవ్వరికి క్లారిటీ లేదు. ఇప్పటికే విజయవాడ టీడీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఎంపీ కేశినేని నాని ఒక వర్గంగాను, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. తదితరులు ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఇక, ఎవరికీ కాకుండా.. మరొకొందరు ఎవరికి వారే చక్రం తిప్పుతున్నారు.. ఈ క్రమంలో రాధా ఏ వర్గానికి చెందిన నాయకుడు ? అనేది ప్రశ్న. పోనీ.. తనే ఒంటరిగా చక్రం తిప్పుతారా? అంటే.. టీడీపీ శ్రేణులు కలిసిరావడం లేదు.
ఆయన మనసంతా సెంట్రల్ నియోజకవర్గం మీదే ఉంది. ఎప్పటకి అయినా అక్కడ పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అవ్వాలన్నదే ఆయన కోరిక. అయితే సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సైతం రాధాను అక్కడ అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం రాజధాని అమరావతికి మద్దతుగా కొన్నాళ్లు వరకు మాట్లాడినా.. తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాధా .. విషయం రాజకీయంగా ఎటు మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on March 30, 2021 11:48 am
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…