ఈ విషయంపై చర్చించే ముందు.. కొంచెం లోతుగా పరిశీలించాల్సి.. ఈ క్రమంలో అసలు ఇప్పుడున్న పరిస్థితికి.. కొన్నాళ్ల కిందటకి ఏం జరిగిందో చూద్దాం..
రెండేళ్ల కిందట:
హైదరాబాద్ నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ హోటళ్లు కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా.. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎవరిని కదిలించినా.. మా భూమికి మంచి ధర వచ్చిందండి! అనే మాట తప్ప.. మేం నష్టపోయాం అనే మాటే లేదు. దీనికి కారణం.. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి ఏర్పడడం.. దీనికి సంబంధించిన అంచనాలు జోరుగా ప్రచారం కావడం. ప్రపంచ స్థాయి సామర్థ్యం.. ఉన్న కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడమే. దీంతో తెలంగాణలోని భూముల ధరలతో పోలిస్తే.. ఏపీలో భూముల ధరలకు రెక్కలు తొడిగాయి. అక్కడ నాలుగు ఎకరాలు అమ్మితే.. ఏపీలొ ఒక ఎకరం కొనే పరిస్థితి!!
ఇప్పుడు:
తెలంగాణ అసెంబ్లీలోనే కేసీఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీలో సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు ఇక్కడ నాలుగు ఎకరాలు అమ్మితే.. ప్రకాశం జిల్లాలో ఒక ఎకరం కొనడం కష్టమయ్యేది. కానీ.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా.. ఇక్కడ భూములకు రెక్కలు వస్తున్నాయి. ఏపీ పని రివర్స్ అయింది. ఇక్కడ ఎకరం అమ్మితే.. అక్కడ నాలుగు ఎకరాలు కొనొచ్చు!!
అసలు సంగతి!!
కేసీఆర్ కామెంట్లను తేలికగా తీసుకునే పనిలేదు. చాలా వ్యూహాత్మకంగా ఆయన వ్యవహరించారు. కేవలం ఆయన భూములను రియల్ ఎస్టేట్‌ను మాత్రమే పోల్చి చెప్పిన మాటలు కావు అంటున్నారు పరిశీలకులు. సీఎం జగన్ పనితీరుతో ఏపీ పరిస్థితి అప్పుల పాలు అయిపోయిందని.. ఇప్పటికే ఆర్థిక వర్గాల నుంచి విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాజధాని విషయం కూడా గందరగోళంలో పడడంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిని.. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ఫలితంగా భవన నిర్మాణ రంగం మరింతగా అగాధంలోకి పడిపోయింది.
ఇక, ఎక్కడా పెట్టుబడుటలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సో.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశాజనమైన రాష్ట్రం.. పెట్టుబడుల పరంగా.. పాలన పరంగా అభివృద్ధిలో ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే! అనే కీలక సందేశాన్ని.. ప్రచారాన్ని కల్పించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా జగన్ లోపాలను, ఏపీ పరిస్థితిని చెప్పకనే అసెంబ్లీలో చెప్పారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 27, 2021 11:46 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…