తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీని గెలిపించే బాధ్యత చంద్రబాబునాయుడు ఓ సీనియర్ నేతపై ఉంచారు. ఇంతకీ ఆయనెవరయ్యా అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గెలుపు బాధ్యతను సోమిరెడ్డికి అప్పగించినట్లు చంద్రబాబు ప్రకటించగానే పార్టీలో అందరు ఆశ్చర్యపోయారు.
కారణం ఏమిటంటే సోమిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి దాదాపు పాతికేళ్ళవుతోంది. 1999లో చివరిసారిగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచారు. ఆ తర్వాత నుండి ప్రతి ఎన్నికలోను పోటీ చేయటం, ఓడిపోవటమే. 2004, 2009, 2014, 2019 వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి నిజానికి గెలుపుకు చాలా దూరమైపోయారు. 2014లో ఓడిపోయిన సోమిరెడ్డికి ఎంఎల్సీ ఇఛ్చి చంద్రబాబు మంత్రిని చేశారు. ఇన్ని ఎన్నికల్లో వరసగా ఓడిపోతున్నారంటే ఆయనకున్న ఇమేజి, పట్టు ఏమిటో అర్ధమైపోతోంది.
అలాంటి సీనియర్ నేతకు తిరుపతి పార్లమెంటు గెలిపించేత సీన్ లేదని అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయం చంద్రబాబుకు తెలీదా ? తెలుసు, అయినా సోమిరెడ్డికే బాధ్యత అప్పగించారు. అందుకనే పార్టీలోని నేతలంతా అంతగా ఆశ్చర్యపోయింది. తన నియోజకవర్గంలోనే గెలవలేని సోమిరెడ్డి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని ఎలా గెలిపించగలరు ?
అసలే అధికార పార్టీ బాహుబలి స్ధాయిలో చాలా బలంగా ఉంది. పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో వరుస గెలుపుతో ఆ విషయం అందరికీ అర్ధమైపోయింది. ఇదే సమయంలో టీడీపీతో కలుపుకుని ప్రతిపక్ష పార్టీలన్నీ చాలా బలహీనంగా ఉన్నాయి. ఉన్నంతలో టీడీపీని కొంతమెరుగనే స్ధితిలో ఉంది. ఇలాంటి నేపధ్యంలో వచ్చిన ఉపఎన్నికలో పార్టీని గెలిపించే బాధ్యత అప్పగించే విషయంలో చంద్రబాబు ఎంత జాగ్రత్తగా ఉండాలి ? బహుశా తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమిరెడ్డే మెరుగైన నేతని చంద్రబాబు అనుకున్నారా ? చూద్దాం సోమిరెడ్డి ఏమి చేస్తారో ?
This post was last modified on March 24, 2021 3:40 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…