ఉప్పులేటి కల్పన. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఆదిలో టీడీపీ నుంచి రాజకీయాలు ప్రారంభించిన ఆమె ఆ పార్టీ తరపున వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిన ఆమె ఆ తర్వాత వైసీపీ పంచన చేరారు. ఈ క్రమంలో 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గిరీ ఆశతో పార్టీ మారి టీడీపీ ప్రభుత్వానికి జై కొట్టారు. ఆ తర్వాత ఆమె ఆశలు నెరవేరలేదు. దీనికి టీడీపీలో నే కీలక నేతగా ఉన్న వర్ల రామయ్య అడ్డు పడ్డారనే ప్రచారం ఉంది. ఇక, అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆమె.. గత ఎన్నికల్లోనూ టికెట్ దక్కించుకునేందుకే నానా ఆపసోపాలు పడ్డారు. మరో వైపు తన భర్తకు బాపట్ల ఎంపీ టిక్కెట్ కోసం అనేక ప్రయత్నాలు చేసినా పామర్రు సీటు మాత్రమే ఆమెకు దక్కింది.
పామర్రులో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ దూకుడుగా ముందుకు సాగుతూ నియోజకవర్గంలో టీడీపీకి ఎక్కడికక్కడ చెక్ పెట్టేస్తున్నారు. పైగా మంత్రి కొడాలి నాని కనుసన్నల్లో ఆయన మెలుగుతున్నారు. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అయిన ఈ ప్రాంతంలో కమ్మల ప్రాబల్యం ఎక్కువ. అయితే మంత్రి కొడాలి నాని ఇక్కడ ఈ సామాజిక వర్గంలో కీలక నేతలను వైసీపీ వైపు మళ్లించేశారు. దీంతో టీడీపీకి పునాదులు కదిలిపోతోన్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్న పలు కుటుంబాలు ఫ్యాన్ గూటి కిందకు చేరిపోయాయి.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. వర్ల వర్గం ఇక్కడ చక్రం తిప్పుతోంది. పైగా ఉప్పులేటి కనుసన్నల్లో నడిచేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు సైతం ఆమెను పక్కన పెట్టి వర్లకు పార్టీలో పొలిట్ బ్యూరో పదవిని రెన్యువల్ చేశారు. దీంతో పామర్రులో టీడీపీని వర్లే అనధికారికంగా శాసిస్తున్నారు. కల్పన యాక్టివ్‌గా ఉండడం లేదు సరికదా ? ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో ఉన్నా ఉపయోగం లేదని తన అనుచరులతోనే అంటున్నారని స్థానికంగా టీడీపీ వాళ్లే చెపుతున్నారు. ఈ నేపథ్యంలో కల్పన రాజకీయ శకం ఇక ముగిసిందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె పార్టీ మారాలని చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె వైసీపీలోకి వెళ్లే ప్రయత్నాలు కూడా చేసినా అటు వైపు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. ఇటు టీడీపీలోనూ ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. వెరసి మొత్తంగా అటు వైసీపీ దగ్గరకు రానివ్వని పరిస్థితి.. ఇటు టీడీపీ నేతలు చేరువ కాలేని పరిస్థితిని కల్పన ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొత్త నేతకు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతుండడం గమనార్హం. దీంతో కల్పన రాజకీయం ఇక, కల్పనే! అనే మాట వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on March 23, 2021 6:02 pm
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్‌ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్‌కు…