తెలంగాణలో గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచినప్పటి నుంచి బీజేపీ నేతలు చేస్తోన్న హంగామాకు అంతే లేదు. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం గోషామహాల్ సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా వచ్చిన గెలుపు చూసుకుని తెగ ఎగిరిపడింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోయినా దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో 48 డివిజన్లలో గెలుపుతో మళ్లీ హంగామా స్టార్ట్ చేసింది. నాగార్జునా సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేది మేమే అంటూ గొప్పలు ప్రారంభించేసింది. అయితే తెలంగాణలో ఎప్పుడూ ఏదో ఒక అంశంతో సంచలనాలు మాత్రమే నమోదు చేస్తోన్న బీజేపీకి క్షేత్రస్థాయిలో ఎంత మాత్రం బలం లేదని.. ఆపార్టీది కేవలం బలుపు మాత్రమే అని.. వాపు కాదని తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పేశాయి.
తెలంగాణ బీజేపీ కలలు కరిగిపోయాయి. ఆ పార్టీకి ఏదైనా పట్టు ఉంటే అది విద్యావంతుల్లోనే ఉండాలి. అలాంటిది తాజా ఎమ్మెల్సీ ఫలితాల్లో అదే విద్యావంతులు, ఉద్యోగులే బీజేపీకి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోయింది. ఇక నల్గొండ నియోజకవర్గంలో అయితే మరీ ఘోరంగా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. విద్యావంతుల్లోనే ఆ పార్టీకి పట్టులేదన్నది నిరూపితమవ్వగా.. ఇక సాధారణ ప్రజల్లో ఎంతో బలం ఉందని ఊహించుకోవడం కూడా భ్రమే అవుతుంది. తెలంగాణలోనే ఈ పరిస్థితి ఉంటే.. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం, ఏపీకి చేస్తోన్న అన్యాయం ఆ పార్టీని అధః పాతాళానికి తొక్కి పడేశాయి. ఏపీలో బీజేపీని ఎవ్వరూ నాశనం చేయకుండా ఆ పార్టీకి ఆ పార్టీయే కావాల్సినంత లోతులో బొంద పెట్టేసుకుంది.
పార్టీకి కాస్తో కూస్తో ఆశలు ఉన్న తెలంగాణలో అది కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగో స్ధానంలో ఉందంటే.. ఇక తిరుపతిలో కూడా ఖచ్చితంగా మూడో స్థానమే గతి అవుతుందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ ఇక్కడ పోటీ వైసీపీ వర్సెస్ తెలుగుదేశం మధ్యే అన్నది క్లారిటీ వచ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఆ అధికార మదం చూసుకుని తెలంగాణ బీజేపీ నాయకులు ఇక్కడ అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై పసలేని విమర్శలు చేస్తూ కాలం గడుపుతూ వచ్చారే తప్పా.. క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నదానిపై దృష్టి పెట్టలేదు. అందుకే ఇప్పుడు బీజేపీ బలుపు బుడగ పేలిపోయింది.
This post was last modified on March 20, 2021 9:11 pm
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…