Political News

ఈసారి పద్దు మామూలుగా లేదుగా హరీశ్ మాష్టారు

గత రికార్డుల్ని బ్రేక్ చేసేలా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు తెలంగాణరాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు. గతంలో ఎప్పుడు లేనంత ఎక్కువ జంపింగ్ తో.. ఏకంగా రూ.2లక్షల కోట్లకు మించిన బడ్జెట్ అంచనాల్ని ఈసారి వెల్లడించటం గమనార్హం. ఇప్పటికే గత బడ్జెట్ మొత్తాన్ని చేరుకోని వేళ.. ఈసారి అంతకు మించి రూ.2.3లక్షల కోట్ల మొత్తంతో బడ్జెట్ ను ఏర్పాటు చేయటం ఆసక్తికరంగా మారింది. తాజాగా చేసిన ప్రతిపాదనలు.. వివిధ వర్గాలకు.. రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.

తాజా ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.2,30,825.95 కోట్లుగా ప్రతిపాదించారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • తెలంగాణ బడ్జెట్‌ రూ.2 లక్షల 30 వేల 825 కోట్లు
  • గత బడ్జెట్‌ కంటే 48 వేల కోట్లు అధికంగా కేటాయింపులు జరపటం విశేషం
  • రెవెన్యూ వ్యయం రూ.లక్షా 69 వేల 383.44 కోట్లు
  • క్యాపిటల్ వ్యయం రూ.29 వేల 46 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ.6743.50 కోట్లు
  • ఆర్థిక లోటు రూ.45,509 కోట్లు

వివిధ రంగాలకు కేటాయింపుల్ని చూస్తే..

  • ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులు
  • ఎమ్మెల్సీలకు 800 కోట్లు కేటాయింపు
  • పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధికి రూ.29,271 కోట్లు
  • వ్యవసాయరంగానికి రూ.25వేల కోట్లు
  • సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు
  • రైతుబంధుకు రూ.14,800 కోట్లు
  • ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు
  • డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం రూ.11 వేల కోట్లు
    విద్య
  • పాఠశాల విద్య రూ.11,735 కోట్లు
  • విద్యారంగ ఉన్నతీకరణకు రూ.4 వేల కోట్లు
  • మున్సిపల్‌శాఖకు రూ.15,030 కోట్లు
  • రహదారులు, భవనాలశాఖకు రూ.8,788 కోట్లు
  • వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ.3,077 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు
  • ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణకు రూ.2 వేల కోట్లు
  • ఉన్నత విద్య రూ.1,873 కోట్లు
  • హోంశాఖకు రూ.6,465 కోట్లు
  • పల్లె ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు రూ.5761 కోట్లు
  • బీసీ సంక్షేమశాఖకు రూ.5,522 కోట్లు
  • రుణమాఫీకి రూ.5,225 కోట్లు
  • ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు
  • స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్లు
  • కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు
  • నూతన సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు
  • రీజనల్‌ రింగ్‌రోడ్డు భూసేకరణకు రూ.750 కోట్లు
  • అటవీశాఖకు రూ.1276 కోట్లు
  • దేవాదాయశాఖకు రూ.720 కోట్లు
  • పశుసంవర్థక, మత్స్యశాఖకు రూ.1730 కోట్లు
  • సమగ్ర భూసర్వే కోసం రూ.400 కోట్లు
  • రైతుభీమా పథకానికి రూ.1200 కోట్లు
  • వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
  • సీఎం దళిత ఎంపవర్‌మెంట్‌ కోసం రూ.1000 కోట్లు
  • గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు
  • గొల్ల కురుమలకు రూ.300 కోట్లతో 3 లక్షల యూనిట్ల గొర్రెలు
  • చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు
  • బీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
  • మైనార్టీల సంక్షేమానికి రూ.1600 కోట్లు
  • మహిళ శిశు సంక్షేమం రూ.1702 కోట్లు
  • మెట్రో రైలుకు రూ.1000 కోట్లు
  • సుంకిశాల తాగునీటి ప్రాజెక్ట్‌కు రూ.725 కోట్లు
  • పట్టణ ప్రగతి కోసం రూ.500 కోట్లు
  • వైకుంఠ దామాల నిర్మాణానికి రూ.200 కోట్లు
  • ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ.250 కోట్లు
  • మూసీ నది పునరుజ్జీవం కోసం రూ200 కోట్లు
  • పోలీస్‌ స్టేషన్లలో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.20 కోట్లు
  • యూనివర్సిటీల్లో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.10 కోట్లు
  • ఓఆర్ఆర్‌ వెలుపలి కాలనీల తాగునీటి కోసం రూ.250 కోట్లు
  • వరంగల్‌ కార్పొరేషన్‌కు 250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు 150 కోట్లు
  • ఐటీ రంగానికి రూ.360 కోట్లు
  • పంచాయతీరాజ్‌ రహదారులకు రూ.300 కోట్లు
  • పోలీస్‌ శాఖకు రూ.725 కోట్లు
  • టూరిజం రూ.726 కోట్లు
  • రాష్ట్రంలో కొత్తగా 21 ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.400 కోట్లు
  • కొత్త ఎయిర్‌పోర్టుల కోసం రూ.100 కోట్లు

This post was last modified on March 18, 2021 3:44 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

1 hour ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

3 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

5 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

8 hours ago