టాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మాస్ రాజా రవితేజతో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి జత కట్టే అవశాలున్నాయి. వీరి కలయికలో ఒక ఆసక్తికర సినిమా రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మలయాళంలో విజయవంతం అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రాన్ని రవితేజ-సేతుపతి కలయికలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారట.
ఒరిజినల్లో పృథ్వీరాజ్ చేసిన సినిమా స్టార్ పాత్రలో రవితేజ నటించనుండగా.. సూరజ్ చేసిన ఆర్టీవో ఇన్‌స్పెక్టర్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ హక్కులు కొన్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని.. అతనే ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు. ఈ కాంబినేషన్ నిజమే అయితే.. ఈ ప్రాజెక్టుకు అనూహ్యమైన క్రేజ్ రావడం ఖాయం.
మాస్టర్, ఉప్పెన సినిమాలతో సేతుపతికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అతడి కోసమే సినిమాలకు వచ్చే అభిమానులు పెద్ద ఎత్తున తయారయ్యారు. ఇక మాస్ రాజా సినిమాలో అతడికి దీటుగా ఉండే పాత్రలో సేతుపతి కనిపిస్తే ఈ ప్రాజెక్టుకు వచ్చే క్రేజే వేరు. ‘డ్రైవింగ్ లైసెన్స్’ మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రం. గత ఏడాది హఠాత్తుగా మరణించిన ‘అయ్యప్పనుం కోషీయుం’ దర్శకుడు సాచీ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే రాశాడు. ఆయన బెస్ట్ వర్క్స్‌లో ఒకటిగా ‘డ్రైవింగ్ లైసెన్స్’ పేరు తెచ్చుకుంది.
మోటార్ కార్ రేసింగ్ నేపథ్యంలో సాగే సినిమాలో నటించడం కోసం స్టార్ హీరో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం తన వీరాభిమాని అయిన ఆర్టీవో ఇన్‌స్పెక్టర్ దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ అతడిని అవమానించేలా వ్యవహరిస్తాడు. దీంతో తన అభిమాన కథానాయకుడికి ఎదురు తిరిగి అతడికి లైసెన్స్ ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాగే పోరు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.
This post was last modified on March 18, 2021 3:41 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…