Political News

పవన్ ప్రభావం ఎంతో తేలిపోయిందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం జనాలపై ఏమాత్రం లేదని స్పష్టమైపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టేసిన పవన్ మద్దతుదారులకు, అభిమానులకు, జనాలకు వీడియో సందేశాలను మాత్రం పంపించారు. అదేమిటంటే జనసేన అభ్యర్ధులను గెలిపించమని. పనిలో పనిగా వైసీపీని ఓడించమని కూడా పిలుపిచ్చారు. అయితే ఏ మున్సిపాలిటిలో కూడా పవన్ పిలుపుకు జనాలు స్పందించలేదని అర్ధమైపోయింది.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టును పవన్ నూరుశాతం వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే వైజాగ్ కు ఎప్పుడు వెళ్ళినా లేకపోతే అమరావతి ప్రాంతంలో తిరిగినా జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు అనేకసార్లు మాట్లాడారు. అయితే ఇటు వైజాగ్ లో కానీ అటు అమరావతి ప్రాంతంలో కానీ పవన్ను ఎవరు పట్టించుకోలేదని తేలిపోయింది.

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన 49 డివిజన్లలో పోటీ చేసింది. 98 డివిజన్ల కార్పొరేషన్లలో బీజేపీ, జనసేన చెరో 49 డివిజన్లలో పోటీచేశాయి. జనసేన తరపున గెలిచింది కేవలం ముగ్గురంటే ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే. అదికూడా తమ సొంత బలంతో మాత్రమే గెలిచారు. ఎలాగంటే విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ ఎక్కడా ప్రచారం చేయలేదు. పవన్ ప్రచారానికి రాకపోయినా ముగ్గురు గెలిచారంటే అది వారి సొంతబలం వల్లే అని తేలిపోయింది.

ఇక బీజేపీ తరపున పోటీ చేసిన 49 మందిలో గెలిచింది ఒక్కరంటే ఒక్కరు మాత్రమే. చెప్పుకోవటానికి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా విశాఖపట్నంలో పెద్ద పెద్ద నేతలే ఉన్నారు. మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు, మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు, ఎంఎల్సీ మాధవ్ లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ గెలిచింది మాత్రం ఒక్కరే. దీంతోనే బీజేపీ వైజాగ్ లో ఎంత బలంగా ఉందో అర్ధమైపోతోంది. మొత్తానికి విడివిడిగా అయినా కలిసైనా మిత్రపక్షాల బలంపై క్లారిటి వచ్చేసింది.

This post was last modified on March 17, 2021 1:50 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago