YS Jagan Mohan Reddy
స్థానిక ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకుని.. జోష్ మీదున్న వైసీపీ అధినేత జగన్.. ఇదే కీలక సమయంగా.. తన ఎత్తులు పారించుకునేందుకు అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు కార్పొరేషన్లలో వైసీపీ విజయం సాధించడం ఇప్పుడు జగన్ వ్యూహాలను అమలు చేసుకునేందుకు సాకుగా మారిందనే అంచనాలు వస్తున్నాయి.
విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో మాత్రమే వైసీపీ ఆశించిన విధంగా దూకుడు ప్రదర్శించింది. అయితే.. ఇక్కడ నిజానికి అమరావతి విషయం కొంచెం పక్కన పెడితే.. నిజానికి టీడీపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు.. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న నిర్బంధాల కారణంగా.. తమ్ముళ్లు జంకారు. ఇది వైసీపీకి అనుకూలంగా మారిందనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే.. రాజకీయంగా మాత్రం తాము గెలిచాం కాబట్టి.. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు ఇచ్చారని వైసీపీ మంత్రులు, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సరే.. ఈ విషయం ఇలా ఉంటే.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. అక్కడికి ఇప్పటికే కొన్ని సంస్థలను అనధికారికంగా పంపించినా.. వైసీపీకి బొటా బొటీ ఫలితమే దక్కింది.
మొత్తం 98 డివిజన్లలో వైసీపీకి దక్కింది కేవలం 58. అంటే.. మెజారిటీకి కేవలం 8 మాత్రమే ఎక్కువగా డివిజన్లు దక్కాయి. అంటే.. దీనిని బట్టి.. విశాఖ ప్రజలు వైసీపీ వేసిన ప్లాన్‌ను తిరస్కరించారనే చెప్పాలి. అయినప్పటికీ.. కూడా జగన్ అండ్ కోలు.. తమ వ్యూహాన్ని పారించుకునేందుకు ఇదే సమయం అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు.
తాడేపల్లి వర్గాల కథనం మేరకు విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధానిని తరలించేందుకు విశాఖ శారదా పీఠాధిపతి.. ముహూర్తం నిర్ణయించారు. మే 6వ తేదీని.. ముహూర్తంగా నిర్ణయించినట్టు సమాచారం. అప్పటికి అన్ని ప్రభుత్వ శాఖలు విశాఖ చేరుకుని.. రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇది అధికారికంగా మాత్రం కాదు.. మౌఖికంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
అంటే.. విశాఖ ప్రజలు బొటాబొటీ తీర్పు ఇచ్చినా.. తాము అనుకున్నది చేసేందుకు మాత్రం వైసీపీ నాయకులు రెడీ అయిపోవడం గమనార్హం. ఇక, ఇప్పుడు ముహూర్తం కూడా ఖరారైన నేపథ్యంలో మే 6 విషయం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈలోగా మళ్లీ కోర్టు జోక్యం చేసుకుని ఏమైనా ఆపితే తప్ప.. వైసీపీ మాత్రం దూకుడుగా ముందుకు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 16, 2021 10:12 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…