జనాలు నెమ్మదిగా కరోనాను లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేస్తోందని బయట పరిణామాలు చూస్తే స్పష్టమవుతోంది. ఇంతకుముందులా భయపడటం మానేసి జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. పోలీసులు కూడా మరీ స్ట్రిక్టుగా ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గిపోవడంతో జనాల్లో తేలిక భావం వచ్చినట్లు అనిపిస్తోంది.
గత పది రోజుల్లో వచ్చిన కేసులన్నీ కలిపినా వంద లోపే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక దశలో రోజు మొత్తంలో రెండు కేసులే బయటపడ్డాయి. శుక్రవారం నమోదైన కేసులు పది. దీంతో తెలంగాణలో కరోనా కర్వ్ తగ్గుముఖం పట్టిందని.. త్వరలోనే సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయనే ఆశతో ఉన్నారు జనాలు. ఐతే శనివారం ఉన్నట్లుండి కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
ఒక రోజు వ్యవధిలో తెలంగాణలో 31 కేసులు బయటపడ్డాయి. గత పది రోజుల్లో అత్యధికంగా కేసులు బయటపడ్డది ఈ రోజే. మరి ఈ సడెన్ జంప్‌కు కారణమేంటన్నది ఆసక్తికరంగా మారింది. మద్యం దుకాణాలు బుధవారం పునఃప్రారంభం కావడంతో జనాలు పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. ఉన్నంతలో క్రమశిక్షణతోనే వ్యవహరించినప్పటికీ.. మందు బాబుల అత్యుత్సాహం కరోనా వ్యాప్తి పెరగడానికి కారణమై ఉంటుందని.. ఈ నేపథ్యంలోనే కేసుల సంఖ్య పెరిగిందని.. మున్ముందు ఇంకా పెరగొచ్చని అంటున్నారు.
ఈ రోజు కేసుల సంఖ్య బయటికి రాగానే నింద మందు బాబుల మీదికి వెళ్తోంది. మద్యం దుకాణాలు బంద్ చేయాలన్న డిమాండ్ మళ్లీ పైకి లేచింది. పొరుగున ఏపీలో గత 24 గంటల్లో 43 కరోనా పాజిటవ్ కేసులు తేలినట్లు శనివారం ఉదయం బులెటిన్ ఇచ్చారు. ఐతే తెలంగాణలో కరోనా టెస్టులు చాలా తక్కువ స్థాయిలో చేస్తున్నారని, టెస్టుల సంఖ్య పెంచితే కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని నిపుణులంటున్నారు.
This post was last modified on May 10, 2020 1:53 pm
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…