రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి.. జోరుమీదున్న వైసీపీకి పంటికింద రాయిలా.. కంట్లో నలుసులా.. రెండు మునిసిపాలిటీలు మారాయి. వీటిలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కడప జిల్లాలోని మైదుకూరు. ఈ రెండు చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు మెజారిటీ సాధించారు. ఈ క్రమంలో ఇక్కడ వైసీపీ ప్రస్తుతం పరాజయం పాలైంది. అయితే.. ఇక్కడ కూడా.. తమ ఖతా తెరుస్తామని.. వీటిని కూడా తమ బుట్టలో వేసుకుంటామని.. వైసీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం. అయితే.. సాంకేతికంగా చూస్తే.. ఇది వైసీపీకి సాధ్యమేనని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. వైసీపీ దగ్గర ఎక్స్ అఫీషియో.. ఓట్ల బ్యాంకు ఉండడమే.
తాడిపత్రి విషయానికి వస్తే.. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగి.. టీడీపీ తరఫున తన వారిని నిలబెట్టారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కి.. మునిసిపల్ చైర్మన్ గిరిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే హోరా హోరీ సాగిన పోరులో .. జేసీ వర్గం.. ఆశించిన విధంగానే దూకుడు చూపించింది. ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వీటిలో వైసీపీ 16 చోట్ల విజయం సాధించింద. ఇక, టీడీపీ ఇక్కడ 18 చోట్ల విజయం దక్కించుకుంది. స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు విజయం దక్కించుకున్నారు. అయితే.. మునిసిపల్‌లో పార్టీ పాగా వేయాలంటే.. 19 మంది అభ్యర్థుల మద్దతు అవసరం.
ఈ క్రమంలో వైసీపీ తనకున్న ఎక్స్ అఫిషియో.. ఓట్లు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఓట్లను వినియోగించుకుని.. మరో స్వతంత్ర అభ్యర్థిని తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇది సాధ్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే జరిగితే.. జేసీ వర్గం చేసిన కృషి మట్టిపాలవడం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో మైదుకూరు విషయానికి వస్తే.. ఇక్కడ.. టీడీపీ, వైసీపీ పోటా పోటీగా ముందుకు సాగాయి. టీడీపీ తరఫున పుట్టా సుధాకర్ యాదవ్ పట్టు కోసం ప్రయత్నించారు.
ఇక్కడ మొత్తం.. 24 వార్డులు ఉన్నాయి. వీటిలో వైసీపీ 11, టీడీపీ 12, ఇతరులు ఒక చోట విజయం దక్కించుకున్నారు. సాంకేతికంగా చూస్తే.. టీడీపీ గెలిచినట్టు అనిపించినా.. ఇక్కడ కూడా ఎక్స్ అఫిషియో .. ఓట్లు కీలకంగా మారనున్నాయి. మైదుకూరు ఎమ్మెల్యే , రాజంపేట ఎంపీలు ఇద్దరూ కూడా వైసీపీ నేతలే కనుక.. ఇక్కడ కూడా వైసీపీనే పాగా వేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా చూస్తే.. మొత్తంగా టీడీపీ జీరో కావడం గమనార్హం.
This post was last modified on March 15, 2021 1:37 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…