Political News

వైసీపీలో అంద‌రూ ఎంపీల‌కు త‌ల‌నొప్పే ?

వైసీపీలో ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు ఉన్నారు. వీరిలో ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ ఎంపీలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌ల నుంచి తీవ్ర అస‌మ్మ‌తి ఎదుర్కొంటున్నారు. పార్టీలో కీల‌కంగా చ‌క్రం తిప్పే ఎంపీల‌కు సైతం ఈ అస‌మ్మ‌తి త‌ప్ప‌డం లేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ను విజ‌యసాయి, మంత్రి అవంతి, జిల్లా ఎమ్మెల్యేలు పూర్తిగా డ‌మ్మీల‌ను చేసేశార‌న్న చ‌ర్చ ఉంది. ఆయ‌న కూడా ఏదో ఎంపీగా ఉండ‌డం మిన‌హా చేసేదేం లేదు. అన‌కాప‌ల్లి ఎంపీ స‌త్య‌వ‌తికి స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్‌కు కోల్డ్ వార్ తీవ్ర‌మైంది.

ఇక గోదావ‌రిలో అంద‌రూ ఎమ్మెల్యేల‌కు అస‌మ్మ‌తి త‌ప్ప‌డం లేదు. కాకినాడ ఎంపీ వంగా గీత‌కు పిఠాపురం ఎమ్మెల్యే దొర‌బాబుకు ప‌డ‌ట్లేదు. గీత క‌న్ను పిఠాపురం మీద ఉండ‌డ‌మే కార‌ణ‌మంటున్నారు. అమ‌లాపురం ఎంపీ చింతా అనూరాథ‌కు మంత్రి విశ్వ‌రూప్‌తోనూ, మ‌రో మంత్రి చెల్లుబోయిన వేణుతోనూ, రాజోలు వైసీపీ నేత‌ల‌తోనూ పొస‌గ‌ట్లేదు. ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజాకు తీవ్ర‌మైన యుద్ధం న‌డుస్తోంది. ఆ మాట‌కు వ‌స్తే ఎంపీ భ‌ర‌త్‌తో మ‌రి కొంద‌రు నేత‌ల‌కు కూడా ప‌డ‌ట్లేదు.

ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు మంత్రి ఆళ్ల నానితో గ్యాప్ ఉందంటున్నారు. ఇటు శ్రీథ‌ర్ సొంత నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఎలీజా సైతం శ్రీథ‌ర్‌కు వ్య‌తిరేకంగా గ్రూప్ న‌డుపుతున్నారు. న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు రఘురామ కృష్ణంరాజు ఏకంగా పార్టీలోనే పెద్ద అస‌మ్మ‌తి నేత అయిపోయారు. బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌కు ఆయ‌న పార్ల‌మెంటు ప‌రిధిలోని ప‌లువురు పార్టీ నేత‌ల‌తోనే కాకుండా ఇటు ఆయ‌న‌కు సంబంధం లేకపోయినా గుంటూరు పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవితోనూ త‌క‌రారు న‌డుస్తోంది.

న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయుల‌కు ఆయ‌న పార్ల‌మెంటు ప‌రిధిలోని ఎమ్మెల్యేలు విడ‌ద‌ల ర‌జ‌నీ, కాసు మ‌హేష్ రెడ్డి, బొల్లా బ్ర‌హ్మ‌నాయుడుతో స‌ఖ్య‌త లేదు. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట‌కు మంత్రి బాలినేనికి గ్యాప్ ఉంది. అటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌కు ఎమ్మెల్యేల‌తో పొస‌గ‌క పోయినా ఆయ‌న వ్యాపారాలు చేసుకుంటూ నెల్లూరు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

క‌డ‌ప‌, రాజంపేట ఇద్ద‌రు ఎంపీలు స్ట్రాంగ్‌గానే ఉన్నా వీరికి జ‌గ‌న్‌తో ఉన్న అనుబంధం నేప‌థ్యంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో జోక్యం చేసుకుంటున్నార‌ని ప‌లువురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అనంత‌పురం జిల్లాలో ఇద్ద‌రు ఎంపీల‌కు ఎమ్మెల్యేలకు కూడా పొస‌గ‌ట్లేదు. ఉన్నంత‌లో క‌ర్నూలు జిల్లా ఎంపీల‌తో పాటు బందరు, విజ‌య‌న‌గ‌రం, అర‌కు ఎంపీలే కాస్త వివాదాల‌కు దూరంగా ఉంటోన్న ప‌రిస్థితి ఉంది.

This post was last modified on March 13, 2021 8:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

IPL షెడ్యూల్.. బీసీసీఐ బిగ్ సర్‌ప్రైజ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…

12 mins ago

రాహుల్ ఔట్: ఇది న్యాయమేనా?

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా…

20 mins ago

ఇక‌… తోపుదుర్తి వంతు: టార్గెట్ చేసిన ప‌రిటాల‌.. !

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌… రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…

35 mins ago

‘ఆర్‌సీ 16’ షూటింగ్ షురూ.. మ‌రో వారం చ‌ర‌ణ్ అక్క‌డే!

గేమ్ ఛేంజ‌ర్ ఇంకా విడుద‌లే కాలేదు రామ్ చ‌ర‌ణ్ అప్పుడే త‌న త‌దుప‌రి సినిమాను ప‌ట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…

37 mins ago

పార్టీ మార్పులపై హైకోర్టు తుదితీర్పు: బీఆర్ఎస్ కు షాక్

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్…

59 mins ago