అలవాటైన రీతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి చేతులెత్తేశారు. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ సీటులో పోటీనుండి జనసేన స్వచ్చంధంగా తప్పుకున్నట్లు స్వయంగా పవన్ ప్రకటించారు. తిరుపతి నగర విస్తృతాభివృద్ధికే పోటీ చేసే అవకాశం బీజేపీకి ఇచ్చినట్లు పవన్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. జనసేన పోటీ చేయటమా ? లేకపోతే నగరాన్ని అభివృద్ధి చేయటమా అనే ప్రశ్న వచ్చినపుడు అభివృద్ధినే తమ పార్టీ కాంక్షిస్తున్నట్లు చెప్పుకున్నారు. విచిత్రమేమిటంటే హైదరాబాద్ కార్పొరేషన్ తరహాలోనే తిరుపతిలో కూడా బీజేపీ పోరాడుతుందని పవన్ ప్రకటించటం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుపతి సీటులో పోటీ విషయంలో మొదటినుండి కూడా బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. పవన్ తో సంబంధం లేకుండానే బీజేపీనే ఉపఎన్నికలో పోటీ చేయబోతోందని స్వయంగా వీర్రాజే చెప్పేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే ఆమధ్య తిరుపతిలోనే జరిగిన రెండు రోజుల పార్టీ సమావేశంలో అధికారికంగా బీజేపీ ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. కాకపోతే తర్వాత పవన్ నుండి వచ్చిన అభ్యంతరాల కారణంగా ప్రచారాన్ని బీజేపీ ఆపేసింది.
తిరుపతి సీటులో పోటీచేసే అవకాశం బీజేపీకి వదులుకున్న కారణంగా పవన్ మరోసారి ఫెయిలైనట్లే అని అర్ధమవుతోంది. ఎందుకంటే తిరుపతిలో పోటీ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్ధితుల్లోను జనసేనకు వదులుకునేది లేదని కమలంపార్టీ నేతలు ఎప్పటి నుండో చెబుతున్నారు. అసలు పోటీ విషయంలో రెండు పార్టీల నుండి ఒక కమిటిని నియమిస్తామని జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పింది కూడా కంటితుడుపు మాత్రమే.
మొత్తానికి ముందు గంభీరంగా ప్రకటన చేయటం, తర్వాత తుస్సుమనటం పవన్ కు మామూలే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోటీలో జనసేన అభ్యర్ధుంటే ఎన్నికల ఖర్చు, ప్రచారం లాంటి వన్నీ సమస్యలే. ఎందుకంటే జనసేన అభ్యర్ధికి బీజేపీ ఖర్చుపెడుతుందని అనుకోవటం కేవలం భ్రమ మాత్రమే. అలాగే మోడి, అమిత్ షాలు ప్రచారానికి రావాలన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ బీజేపీ అభ్యర్ధే పోటీలో ఉంటే ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం లేదు. అలాగే నరేంద్రమోడి, అమిత్ లాంటి వాళ్ళు ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది.
పోటీ అవకాశాన్ని లాగేసుకున్నంత మాత్రాన జనసేన అధినేత చేయగలిగేది కూడా ఏమీలేదు. పొత్తు ధర్మాన్ని అనుసరించి ప్రచారానికి పవన్ పాల్గొంటారు. ఎందుకంటే పవన్ కు వేరే ఆప్షన్ లేదుకాబట్టే. మొత్తానికి అన్నీ యాంగిల్స్ లోను బీజేపీ అగ్రనేతలు పవన్ను ఇరికించేసుకున్నారు. అందుకనే భేటీలో ఏమి జరిగిందో ఏమో పోటీనుండి జనసేన తప్పుకున్నట్లు స్వయంగా పవన్ తోనే ప్రకటింపచేశారు.
This post was last modified on March 13, 2021 11:46 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…