Political News

పార్టీ ప్రకటనకు ముహూర్తం కుదిరిందా ?

తెలంగాణాలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్న షర్మిల పార్టీ పేరు ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూలై 8వ తేదీన పార్టీ పేరు ప్రకటించేందుకు షర్మిల రెడీ అవుతున్నట్లు సమాచారం. జూలై 8 అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి. కాబట్టి అదే రోజుల పార్టీ పేరు ప్రకటించేందుకు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ పేరును వైఎస్సార్ టీపీ అని డిసైడ్ చేశారట. ఏపిలో ఇప్పటికే వైఎస్సార్ సీపీ పేరుతో పార్టీ పాపులరైపోయింది. ఇదే పేరు తెలంగాణాలో కూడా క్షేత్రస్ధాయిలో జనాల్లో నానుతోంది. కాబట్టి వైఎస్సార్సీపీని పోలి ఉండేట్లు వైఎస్సీర్టీపీ అని పెడితే సరిపోతుందని షర్మిల అనుకున్నారట. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తరపున ఏమైనా అభ్యంతరాలు వస్తాయా ? అనే అనుమానిస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ఇఫ్పటినుండే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మంను షర్మిల వ్యూహాత్మకంగానే ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో జగన్ ప్రచారం చేయకపోయినా ఖమ్మం జిల్లాలో ఓ ఎంపి+ముగ్గురు ఎంఎల్ఏలు వైఎస్సాసీపీ తరపున గెలిచారు. దాంతో వైఎసార్ కున్న జనబలం అర్ధమవుతోంది.

తెలంగాణాలోని చాలా జిల్లాల్లో వైఎస్సార్ కు మద్దతుదారులు, అభిమానులున్నారు. వారందరినీ సంఘటితం చేయటం ద్వారా గట్టి ఫోర్సుగా తయారవ్వాలని షర్మిల భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయంగా పెద్ద వ్యాక్యూమ్ ఉందన్నది షర్మిల భావన. కాంగ్రెస్, టీడీపీలు దాదాపు నామమాత్రమైపోయాయి. బీజేపీ కూడా ఏదో కాస్త ఊపులో ఉందే కానీ నిజమైన బలం కాదని అనుమానిస్తున్నారు. అందుకనే ఆ గ్యాప్ ను భర్తీ చేయటానికే షర్మిల రెడీ అవుతున్నారు. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.

This post was last modified on March 12, 2021 3:06 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

పవన్ ను టచ్ చేయడం అసాధ్యం!

నటుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను ఎన్నింటినో సాధించారు. ఇప్పుడు అటు సినిమాలతో పాటుగా…

1 hour ago

హైరానా సాంగ్ థియేటర్ లో అందుకే తీసేశాం : తమన్

ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా చూశాక అధిక శాతం ప్రేక్షకులు షాక్ కు గురైన అంశం నానా హైరానా…

11 hours ago

విజయ్69 మీద గణేష్ కామెంట్స్… రావిపూడి క్లారిటీ

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 69వ సినిమా భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం రెండు నెలలుగా జరుగుతూనే ఉంది.…

11 hours ago

సంక్రాంతి కైనా సొంత ఊర్లకు వెళ్ళమంటున్న సీఎం

సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని సీఎం చంద్ర‌బాబు తెలుగు వారికి శుభాకాంక్ష‌లు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తం గా తెలుగు వారు…

12 hours ago

కష్టాల్లోనూ… కానుకలను ఆపని బాబు గారు!

ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి... కొత్తగా…

14 hours ago

మంచి క్యాస్టింగ్ ను వాడకుండా వదిలేశారా?

గేమ్ ఛేంజర్ బడ్జెట్ అంతగా ఎందుకు పెరిగిపోయిందనే దానికి సవాలక్ష కారణాలున్నాయి కానీ వాటిలో ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.…

14 hours ago