సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది రిపబ్లిక్ టీవీ. ఏదైనా అంశంపై అదే పనిగా నెగిటివ్ స్టోరీలు టెలికాస్ట్ చేస్తుందని దాని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటే.. ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే.. దాని సంగతి చూసే వరకు వదిలిపెట్టరన్న మాటను రిపబ్లిక్ టీవీని అభిమానించే వారు చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా రిపబ్లిక్ టీవీని.. దాని అధినేత ఆర్నాబ్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా రిపబ్లిక్ టీవీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని తప్పుడు కథనాన్ని ప్రసారం చేశారన్నారు. మార్చి నాలుగున జగన్ సన్నిహితుడిపై ఫేక్ న్యూస్ ను టెలికాస్ట్ చేశారన్నారు. ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. జాతీయ మీడియా ముసుగులో తప్పుడు వార్తల్నిప్రచారం చేస్తే సహించేది లేదన్నారు.
తప్పుడు వార్తలపై న్యాయపరంగా కోట్లాడతామన్న ఆయన.. ఐదు కోట్ల ఏపీ ప్రజల ఆదరాభిమానాలు ఉన్న ప్రజా ప్రభుత్వంపై రిపబ్లిక్ టీవీ కత్తి కట్టిందన్నారు. దీని వెనుక ఎవరున్నారో అందరికి తెలుసన్నారు. వైసీపీలో ఎలాంటి గందరగోళం కానీ.. సంక్షోభం కానీ లేవని తేల్చేశారు. విపక్ష నేత చంద్రబాబు కోసమే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
గతంలోనూ నంద్యాల ఉప ఎన్నికను నిర్వహించిన సందర్భంలోనూ ఇదే తీరును రిపబ్లిక్ టీవీ ప్రదర్శించిందని సజ్జల గుర్తు చేశారు. ప్రజలపై బాబు అక్రోశం.. మహిళా కార్యకర్తపై అశోక్ గజపతి చేయి చేసుకున్న వార్తల్ని టెలికాస్ట్ చేయకుండా ప్రభుత్వంపై బురద జల్లే కథనాల వెనుక ఎవరున్నారో అందరికి తెలుసన్నారు. వివాదాల్లో ఉండే ఆర్నాబ్.. జాతికి పట్టిన పీడగా సజ్జల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరి.. ఈ వ్యాఖ్యలకు ఆర్నాబ్ ఏమని బదులిస్తారో చూడాలి.
కొసమెరుపు – దేశమంతటా రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గురించి, అతనికి బీజేపీ పెద్దలకు దేశ రహస్యాలు పంచుకునే సాన్నిహిత్యం ఉందన్న విషయమూ ఇటీవలే బట్టబయలు అయిన విషయమూ తెలుసు. దేశ రహస్యాలు కూడా తెలుసుకునేంత సాన్నిహిత్యం బీజేపీ పెద్దలతో ఉన్న ఉన్న అర్నాబ్ చంద్రబాబు ఫ్రెండ్ ఎలా అవుతాడో మరి.
This post was last modified on March 9, 2021 11:16 am
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…