తమిళనాడు ఎన్నికల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. డీఎంకే యువజన విభాగం ప్రదాన కార్యదర్శి, డీఎంకే చీఫ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితవుతున్నారు. ఒకవైపు సినిహీరోగా మరోవైపు రాజకీయ నేతగా ఉదయనిధి మంచి జోరు మీదున్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో చెన్నైలోని థౌజండ్ లైట్స్ లేదా చేపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ స్దానాల్లో ఏదో ఒకచోట నుండి పోటీ చేయాలని అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా పార్టీ అధిష్టానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. దరఖాస్తు ఆధారంగా ఉదయనిధిని పార్టీ చీఫ్ ఇంటర్వ్యూ కూడా చేశారు. పై రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి ఉదయనిధికి ఉన్న అర్హతలపై ఇంటర్య్యూలో చర్చ కూడా జరిగింది. అయితే చివరకు ఉదయనిధి పోటీకి చీఫ్ నిరాకరించారు. ప్రధాన కార్యదర్శి అడిగినట్లుగా ఎక్కడ కూడా టికెట్ ఇవ్వటం సాధ్యం కాదని స్టాలిన్ తేల్చి చెప్పారు.
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయనిధిని పోటీలో నుండి తప్పిస్తున్నట్లు చీఫ్ ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసి గెలిపించే బాధ్యతను మాత్రం మోపారు. ఎందుకంటే సినీ సెలబ్రిటీ, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి హోదాలో ఉదయనిధిపై అభ్యర్ధుల గెలుపుకు కృషి చేయాల్సిన అవసరం ఎక్కువుందని పార్టీ చెప్పింది.
ఒకవేళ ఉదయనిధి పోటీ చేస్తే ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతారని పార్టీ భావించిందట. అదే పోటీ చేయకపోతే పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసే అవకాశం ఉంటుందని చీఫ్ అనుకున్నారట. అందుకనే టికెట్ నిరాకరించి ప్రచార బాధ్యతలను మోపారు. స్టాలిన్ తీసుకున్న నిర్ణయం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. మొదటిది కొడుకుకే టికెట్ నిరాకరించారనే సిగ్నల్ పార్టీ, ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది. ఇక రెండోది మొహమాటాలకు పోయి నేతలకు టికెట్ కేటాయించాల్సిన అవసరం ఉండదు. మొత్తానికి పార్టీ చీఫ్ కొడుక్కు వ్యూహాత్మకంగానే టికెట్ నిరాకరించారు.
This post was last modified on March 8, 2021 3:13 pm
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…