‘‘అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ’’.. ఈ హెడ్డింగ్‌తో ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు చూశాం. యూట్యూబ్‌లోకి వెళ్తే బోలెడన్ని వీడియోలు కూడా దర్శనమిస్తాయి. దీనిపై ఎన్ని విమర్శలొచ్చినా బాలయ్య ఏమీ పెద్దగా పట్టించుకోడు. అభిమానా.. కార్యకర్తా.. మరో వ్యక్తా అన్నది అనవసరం.. బయటికి వచ్చినపుడు ఆయన దగ్గర తేడాగా ప్రవర్తిస్తే చేతులు ఊరుకోవు. ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు బహిరంగ ప్రదేశాల్లో కూడా అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు బోలెడున్నాయి.
తాజాగా బాలయ్య మరోసారి తన చేతి దురుసు చూపించాడు. ఒక అభిమానిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడిపై చేయి చేసుకున్నాడు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఈ ఉదంతం చోటు చేసుకోవడం గమనార్హం.
ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ గుర్తుతో ఆ ఎన్నికలు జరగవు కాబట్టి బాలయ్య ఆ సమయంలో నియోజకవర్గంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఐతే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొన్ని రోజులుగా బాలయ్య హిందూపురంలోనే ఉండి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా పార్టీ లోకల్ ఆఫీసులో కార్యర్తలు, అభిమానులను కలుసుకున్న సందర్భంగా ఒక వ్యక్తి దూకుడుగా వ్యవహరించాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చింది. అతడి మీద చేయి చేసుకున్నాడు. ఒకసారి కొట్టి వెనక్కి తగ్గాక.. మళ్లీ అతడి మీదికి బాలయ్య దూసుకెళ్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. ఆయన తీవ్ర ఆగ్రహంతోనే దర్శనమిచ్చాడా వీడియోలో. దీంతో బాలయ్యా ఇదేం పనయ్యా అంటూ మరోసారి ఆయన మీద నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఆ అభిమాని కూడా ఈ నందమూరి హీరో గతంలో అన్నట్లు.. ఆయన చేయి తన ఒంటిని తాకడమే గొప్ప విషయం అని మురిసిపోతాడా?
This post was last modified on March 6, 2021 8:43 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…