అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతికత పుణ్యమా అని ఇప్పటివరకు ఊహలకు పరిమితమైన అంశాలు వాస్తవరూపం దాలుస్తున్నాయి. అలాంటిదే ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది. అల్లంత దూరాన ఉన్న ఆకాశం వంక ఆశగా చూసే వారి ఆశల్ని తీర్చేందుకు ఒక సంస్థ సిద్ధమవుతోంది. అంతరిక్షంలో హోటల్ నిర్మించేందుకు రెఢీ అవుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అంతరిక్షంలోకి అతిధుల్ని ఆహ్వానించటానికి ఒక హోటల్ సిద్ధంగా ఉండనుంది.
ఒకప్పుడు అంతరిక్షానికి వెళ్లి వస్తున్నారంటే అదో అద్బుతమన్నట్లుగా ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. ఇదిలా ఉంటే.. శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితమైన అంతరిక్ష యాత్ర సామాన్యులకు పరిచయం చేసేందుకు కొన్ని సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్భిటల్ అసెంబ్లీ అనే సంస్థ అంతరిక్షంలో స్టార్ హోటల్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భూమికి రెండు వేల కిలోమీటర్ల ఎత్తున ఉండే కక్ష్యలోఈ హోటల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఈ కక్ష్యలోనే అమెరికా.. జపాన్.. రష్యా.. యూరప్.. కెనడా కలిపి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించటం తెలిసిందే. ఇక్కడే హోటల్ ను కూడా ఏర్పాటు చేయాలని సదరు సంస్థ భావిస్తోంది. 2025లో నిర్మాణం ప్రారంభించి.. 2027లో అందుబాటులోకి తీసుకురావాలన్నది వారి ఆలోచన. ఇందులో స్పా.. సినిమాహాల్.. జిమ్.. లైబ్రరీ.. సంగీత కార్యక్రమంతో పాటు అంతరిక్షం నుంచి భూమిని చూసే విదంగా లాంజ్ లు.. బార్.. 400 మందికి సరిపడా గదులు ఉండనున్నాయి.
అంతరిక్షంలో వేలాడుతూ.. తిరుగుతూ ఉండే ఈ హోటల్ ప్రతి 90 నిమిషాలకు ఒక భ్రమణం పూర్తి చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు భూమ్యాకర్షనును క్రత్రిమంగా క్రియేట్ చేయనున్నారు. ఇది చంద్రుడిపై ఉండేభూమ్యాకర్షణతో సమానంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాద.. ఇక్కడ గెస్టుహౌస్ లు కూడా ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. చూస్తుంటే.. 2027 వరకు వెయిట్ చేయగలిగితే.. సరికొత్త డేట్ కు ఇంతకుమించిన ఆప్షన్ వేరేది ఉండదేమో?
This post was last modified on March 4, 2021 5:39 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…