Political News

అంబానీ రేంజ్ ఏమిటో చెప్పే మూడు డీల్స్..

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డబుల్ బ్రెడూం ప్లాట్ ను అమ్మే ప్రయత్నం చేయండి? మార్కెట్ రేటు కంటే తక్కువగా అడగటం ఖాయం. వారు అడిగిన మొత్తానికి ప్లాట్ ఇచ్చే కన్నా.. మన దగ్గరే ఉంచుకోవటం మేలన్న భావన కలగటం ఖాయం. ఒక చిన్న ప్లాట్ ను అమ్మే విషయంలోనే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్న వేళలో.. రూ.11వేల కోట్లతో డీల్ ను క్లోజ్ చేయటం మామూలు విషయం కాదు.

వేరే వారికైతే కష్టమేమో కానీ.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మాత్రం ఇది చాలా తేలికైన విషయం. ఆ మధ్యనే ఫేస్ బుక్ కు రిలయన్స్ జియోలో కొంత భాగాన్ని(9.9శాతం వాటా) రూ.43వేల కోట్లకుపైనే అమ్మటం.. ఆ తర్వాత 1.15 శాతం వాటాను రూ.5,666 కోట్లకు అమ్మిన ముకేశ్.. తాజాగా 2.32 శాతం వాటాను రూ.11,367 కోట్లకు క్లోజ్ చేయటం విశేషం.

ఈ ఏడాదికి రిలయన్స్ ను రుణభారం నుంచి విముక్తి చేస్తానని షేర్ హోల్డర్స్ కు తానిచ్చిన మాటకు తగ్గట్లు వరుస డీల్స్ ను చేస్తున్నారు ముకేశ్. తాజాగా జియోలో వాటాను కొనుగోలు చేసింది అంతర్జాతీయ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ దిగ్గజం విస్టా ఈక్విటీ పార్టనర్స్. కేవలం మూడు వారాలవ్యవధిలో మూడు డీల్స్ తో ఏకంగా రూ.60,596 కోట్లను సమీకరించటం గమనార్హం. మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. జియోలో కేవలం 13 శాతం వాటాను విక్రయించటం ద్వారా ఇంత భారీ మొత్తాన్ని సమీకరించటం అంబానీకే చెల్లిందని చెప్పాలి.

మొత్తంగా చూస్తే.. జియోలో 20 శాతం వాటాను అమ్మటమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముకేశ్. ఇప్పటికే పదమూడున్నర శాతం (కచ్ఛితంగా చెప్పాలంటే 13.46శాతం) అమ్మిన ఆయన.. మరో ఆరున్నర శాతాన్ని రానున్న కొద్ది రోజుల్లో అమ్మనున్నారు. దాని ద్వారా తక్కువలో తక్కువ రూ.33వేల కోట్ల వరకు నిధులు సమీకరించే వీలుంది. అంటే.. జియోలో 20 శాతం వాటా అమ్మకంతో దగ్గర దగ్గర రూ.లక్ష కోట్ల వరకూ సమీకరించనున్నారు.

ఇప్పటికే రిలయన్స్ వద్ద నగదు నిల్వలు రూ.1.75లక్షల కోట్లు. రిలయన్స్ రుణభారం మొత్తం రూ.3.36లక్షల కోట్లు. ఈ ఏడాది చివరకు రిలయన్స్ కు ఉన్న రుణాలు మొత్తాన్ని తీర్చేసే లక్ష్యాన్ని అందుకునేందుకు అవసరమైన రైట్స్ ఇష్యూ చేయటం ద్వారా మరో రూ.లక్ష కోట్లు సమీకరిస్తారని చెబుతున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు ముకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం ఖాయమంటున్నారు. అయినా.. అపర కుబేరుడు అనుకుంటే కానిది ఏముంటుంది చెప్పండి?

This post was last modified on May 9, 2020 10:40 am

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

7 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

3 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago