తన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కున్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పే ఆయన.. తన గురించి తాను భలే గొప్పలు చెప్పుకుంటారు. ఏదైనా సీరియస్ ఇష్యూ తెర మీదకు వస్తే.. తాను అలా చేయకుంటే తల కోసుకుంటానని చెప్పేస్తుంటారు. అలా మాటలతో మనసుల్ని ప్రభావితం చేసే కేసీఆర్ కు సూది మందు అంటే చాలా భయం. ఆ మాటకు వస్తే.. ఇంజెక్షన్ చేయాల్సి వస్తే.. ఆయన ఆమడ దూరంలో ఉంటారని చెబుతారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎప్పుడూ లేని విధంగా అదే పనిగా తరచూ ఢిల్లీకి వెళ్లే వారు. అక్కడ రెండు.. మూడు రోజులు ఉండి మళ్లీ వచ్చేసేవారు. ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు? ఎందుకు తిరిగి వస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికేవి కావు. చివరకు బయటకు వచ్చిన విషయం ఆయన డాక్టర్ కు చూపించుకోవటానికి వెళుతుండేవారని.. వారు ఇంజెక్షన్ ఇస్తానని చెప్పినంతనే ఆయన వెనక్కి తగ్గి తిరిగి వచ్చేసే వారని చెబుతారు. చివరకు పలువురు నచ్చజెప్పిన తర్వాత ఇంజక్షన్ కు ఓకే చేసినట్లు చెబుతారు.
అలా సూది మందు అంటే అస్సలు ఇష్టపడని కేసీఆర్.. కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా.. ఆయనఇంజెక్షన్ చేయించుకుంటారా? అన్నది ఇప్పడు ప్రశ్నగా మారింది. అరవై ఏళ్లు దాటిన అందరికి వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. సూది మందును పెద్దగా ఇఫ్టపడని కేసీఆర్.. కోవిడ్ టీకా మాటేమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
వ్యాక్సిన్ రెండో దశలో భాగంగా సోమవారం తెల్లవారుజామునే ప్రధాని మోడీ వ్యాక్సిన్ వేసుకోవటానికి వెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం వేళలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వేసుకున్నారు. కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఎవరూ పెద్దగా వ్యాక్సిన్ వేసుకోవటానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మరి..సార్ టీకా వేసుకోవటానికి ఓకే అంటారా?
This post was last modified on March 2, 2021 10:30 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…