అన్ని సందర్భాల్లో కాకున్నా కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆసక్తికర అంశాలు చాలానే కనిపిస్తాయి. తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారారు రాజన్న కుమార్తె షర్మిల. కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్న ఆమె.. ఇప్పటివరకు ఏ చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయాల్లో ఇంత ఒద్దికగా ముందుకు వెళ్లటం అంత తేలికైన విషయం కాదు. పార్టీ ఏర్పాటు నిర్ణయం మొదలు.. దాన్ని ఎలా అమలు చేయాలన్న అంశం వరకు అంతా ఎవరో ముందస్తుగా స్క్రిప్టు రాసినట్లుగా ఒకటి తర్వాత ఒకటి జరిగటం ఆసక్తికరంగా మారింది.
తనకు పదవి ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని తన అన్న జగన్ ను అడగాలంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమెకు ఎంతో చెప్పామంటూ జగన్ రాజకీయ సలహాదారుల్లో ఒకరు ఆ మధ్య చేసిన వ్యాఖ్యలకు షర్మిల తాజా సమాధానం చూసినప్పుడు.. పదవుల లొల్లి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టటానికి కారణమైందన్న విషయంపై క్లారిటీ రాక మానదు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రావటానికి కారణమైన టీఆర్ఎస్ ఏర్పాటు కూడా ‘పదవి’ చుట్టూనే తిరగటాన్ని మర్చిపోకూడదు. తనకు మంత్రి పదవి ఇస్తారని కేసీఆర్ భావించటం.. అందుకు భిన్నంగా చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేయటం తెలిసిందే. మంత్రి పదవి ఇవ్వని బాబు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీని పెట్టటం.. ప్రత్యేక రాష్ట్ర ఎజెండాను తీసుకున్న కేసీఆర్.. కాల క్రమంలో కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చటం తెలిసిందే.
ఈ రోజు సరిగ్గా.. ఆ విషయాలన్ని గుర్తుకు తెచ్చేలా షర్మిల నోటి నుంచి వచ్చిన మాట ఉండటం ఆసక్తికరం. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యను విశ్లేషిస్తే.. జగన్ వదిలిని బాణంలా దూసుకెళ్లిన ఆమె.. ఏపీలో తన అన్న చేతికి అధికారం వచ్చేలా చేయటంతో కష్టపడ్డారన్నది నిజం. అయితే.. అధికారంలో అంతో ఇంతో వాటా ఇవ్వకుండా.. తనను ఇంటికే పరిమితం చేయటంపై గుర్రుగా ఉన్న షర్మిల.. ఈ రోజున తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో పార్టీ పెట్టినట్లుగా స్పష్టమవుతోంది. అప్పట్లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టటానికి కారణమైన పదవి.. ఈ రోజున షర్మిల పార్టీ పెట్టటానికి అదే కారణం కావటం కాకతాళీయమని చెప్పక తప్పదు. అప్పట్లో కేసీఆర్.. ఇప్పుడు షర్మిల అన్న భావన కలుగక మానదు.
This post was last modified on February 25, 2021 10:44 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…