Political News

వైజాగ్‌పై జగన్‌కు ఎంత ప్రేమో..

విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చురుగ్గా స్పందించారో తెలిసిందే. వెంటనే అమరావతి నుంచి విశాఖకు బయల్దేరారు. బాధితుల్ని ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. తక్షణం భారీగా నష్టపరిహారం ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. విశాఖ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయింది 11 మంది.

ఐతే గత ఏడాది జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఏపీలో ఓ పెద్ద ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరిలో విహారం కోసం వెళ్లిన 80 మంది దాకా బోటుతో సహా మునిగిపోయారు. అందులో అటు ఇటుగా ఓ 30 మంది దాకా బయటపడ్డారు. దాదాపు 50 మంది నీటిలో సజీవ సమాధి అయ్యారు. ఐతే అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ స్పందించిన తీరు విమర్శలకు దారి తీసింది.

ఇప్పుడు వైజాగ్ ఘటనలో మాదిరి జగన్ నుంచి సత్వర స్పందన లేకపోయింది. అందుకు తగ్గట్లే గోదావరిలో సహాయ చర్యలు చేపట్టడంలోనూ అధికార యంత్రాంగం అంత చురుగ్గా స్పందించలేదు. మృతదేహాల్ని కూడా చాలా ఆలస్యంగా బయటికి తీశారు. కానీ విశాఖపట్నం ఉదంతంలో మాత్రం అన్నీ యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. జగన్ కూడా తక్షణం స్పందించారు.

మరి గోదావరికి, విశాఖకు తేడా ఏంటి అనే ప్రశ్న తలెత్తిందిపుడు. ఇందుక్కారణం విశాఖకు రాజధానిని మార్చాలన్న జగన్ పట్టుదలే అన్నది విశ్లేషకుల మాట. కరోనా వైరస్ విషయంలోనూ వైజాగ్‌ను రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ కనిపించింది. ఇక్కడ కరోనా కేసుల్ని తగ్గించి చూపే ప్రయత్నమూ జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు గ్యాస్ లీక్ ఉదంతం విషయంలోనూ జగన్ చొరవ చూసి ఇక్కడికి రాజధాని మార్చే విషయంలో పట్టుదలతో ఉన్న జగన్.. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on May 8, 2020 6:38 pm

Share
Show comments
Published by
Satya
Tags: JaganVizag

Recent Posts

తిరుమల వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ చర్యలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై టీటీడీ కఠినంగా స్పందించింది. శ్రీనివాస్ గౌడ్…

15 minutes ago

ముఫాసా ప్లాన్ బ్రహ్మాండంగా పేలింది!

హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని…

3 hours ago

ఆర్ఆర్ఆర్ ముచ్చట్లను అంత పెట్టి చూస్తారా?

సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్‌లోనే అలాంటి వీడియోలు…

3 hours ago

పివిఆర్ పుష్ప 2 మధ్య ఏం జరిగింది?

నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…

3 hours ago

భీమ్స్….ఇలాగే సానబడితే దూసుకెళ్లొచ్చు !

టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…

7 hours ago