కలలో కూడా ఊహించని రీతిలో భారతీయ అమెరికన్లకు అవకాశాలు లభిస్తున్నాయి. భారత మూలాలు ఉన్న మహిళ అగ్రరాజ్యమైన అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారత మూలాలు ఉన్న పలువురికి బైడెన్ సర్కారులో పదవులు దక్కుతున్నాయి.
తాజాగా ఆ కోవలోకే మరో మహిళ చేశారు. భారత అమెరికన్ అయిన బిడీషా భట్టాచార్యను వ్యవసాయశాఖలోని కీలక స్థానంలో నియమిస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది.
గతంలో ఆమె సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ లో వాతావరణ.. విద్యుత్ పాలసీ డైరెక్టర్ గా పని చేశారు. అంతకు ముందు విలేజ్ క్యాపిటల్ అనే సంస్థలోనూ ఆమె పని చేశారు. వాతావరణ.. విద్యుత్ శాఖల్లో నిపుణురాలైన ఆమె.. భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన సింపా నెట్ వర్క్స్ అనే స్టార్ట్ కంపెనీతో మూడేళ్ల పాటు పని చేశారు.
హార్వర్డ్ వర్సిలీలో పబ్లిక్పాలసీపై మాస్టర్స్.. సెయింట్ ఆలఫ్ కాలేజీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఇప్పటికే పలువురు భారత అమెరికన్లు బైడెన్ సర్కారులో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. తాజా ఎంపికతో ఆ టీంలో బిడీషా చేరినట్లైంది.
This post was last modified on February 23, 2021 1:53 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…