పార్టీ పెట్టాలన్న ఆలోచన కష్టం కాదు కానీ.. పార్టీని పక్కా ప్లాన్ తో పెట్టటం అంత తేలికైన విషయం కాదు. ఈ కారణంతోనే చాలామంది పార్టీలు పెడతారు కానీ.. దాని ప్రభావం ప్రజల్లో పెద్దగా కనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత చాలామంది చాలా పార్టీలే పెట్టారు. కానీ.. ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినవి రెండు పార్టీలే. అందులో ఒకటి టీఆర్ఎస్.. రెండోది వైఎస్సార్ కాంగ్రెస్. మిగిలిన పార్టీల్లో కొన్నింటికి ప్రజాదరణ ఉన్నప్పటికీ.. చేతికి పవర్ మాత్రం రాని దుస్థితి. ఎందుకిలా అంటే.. పార్టీ పెట్టటం ఈజీనే. కానీ.. ప్రజల నమ్మకాన్ని దోచుకోవటం.. వారి మనసుల్లో అధికారం తమకు ఇవ్వాలన్న భావనను బలంగా కలిగించేలా చేయటం మామూలు విషయం కాదు.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో రాజన్న కుమార్తె షర్మిల కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ కావటం.. అందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లటం తెలిసిందే. శనివారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో హైదరాబాద్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ఎత్తుగడను తెర మీదకు తీసుకొచ్చింది షర్మిల టీం.
తనతో భేటీకి వచ్చిన వారందరికి.. 11 ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్ చేతిలో పెట్టారు. అందులో వివరాలు వెల్లడించాలని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రశ్నావళిని పూర్తి చేసే ప్రతి ఒక్కరు ఫోన్ నెంబరుతో పాటు.. వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలతో పాటు వాట్సాప్ ఫోన్ నెంబరును నమోదు చేయలని కోరటం గమానార్హం.
ఇంతకూ షర్మిల టీం ఇస్తున్న ప్రశ్నావళిలో ఏముంది? అన్న విషయంలోకి వెళితే..
1 తెలంగాణలో వైఎ్‌సఆర్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలేమిటి? వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి?
This post was last modified on February 21, 2021 11:07 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…