కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినపుడు ఆయన ప్రసంగాల్ని స్థానిక భాషల్లో తర్జుమా చేయడానికి, అలాగే జనాలు ఇక్కడి భాషల్లో చెప్పే విషయాలను హిందీ లేదా ఇంగ్లిష్‌లో చెప్పడానికి పక్కనే పేరున్న నాయకులు నిలబడుతుంటారు. ఐతే కొన్నిసార్లు ఈ అనువాదాలు తేడా కొట్టేసి రాహుల్ చాలా ఇబ్బంది పడిపోయిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చాలానే కనిపిస్తాయి.
గత నెలలో తమిళనాట పర్యటించిన సందర్భంగానే ఈ అనువాద ఇబ్బంది తప్పలేదు రాహుల్‌కు. కాగా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో ప్రచారం కోసం రాహుల్ వెళ్లిన సందర్భంగా చిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. రాహుల్ పక్కన అనువాదకుడిగా నిలబడ్డ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి.. ఓ మహిళ అన్న మాటల్ని తప్పుగా అనువాదం చేసి తన పరువు తనే తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న ఈ వీడియోలో అసలేముందో చూద్దాం పదండి.
పుదుచ్చేరిలో రాహుల్ పర్యటన సందర్భంగా జనాల సమస్యల గురించి చెప్పమన్నాడు. ఈ సందర్భంగా ఓ మహిళ ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ మాట్లాడింది. తమను ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదని, సీఎం సహా ఎవరూ తమ కోసం రాలేదని ఆగ్రహం, ఆవేదనతో స్పందించింది. ఆమె హావభావాలు చూస్తేనే ఏదో తేడాగా ఉందని ఎవరికైనా అర్థమైపోతుంది. ఐతే ఆమె చెబుతున్న విషయాలను రాహుల్‌కు అనువాదం చేయాల్సిన నారాయణస్వామి.. అసలు విషయాన్ని మార్చి చెప్పారు. తుపాను సమయంలో తమ ప్రాంతాల్లో పర్యటించి, తమకు అండగా నిలిచినందుకు ఆ మహిళ కృతజ్ఞతలు చెబుతోందని రాహుల్‌కు ఇంగ్లిష్‌లో వివరించాడు. ఈ సందర్భంగా సభలో గట్టిగా అరుపులు, చప్పట్లు వినిపించాయి.
ఐతే పెద్ద ఎత్తున మీడియా ఉన్న కార్యక్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించిన విషయాన్ని మరుగున పరిచి తమను ప్రశంసించినట్లుగా సీఎం ప్రొజెక్ట్ చేసుకోవడంతో దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారాయణస్వామిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. జాతీయ స్థాయిలో ఈ వీడియో వైరల్ అయింది.
This post was last modified on February 18, 2021 8:04 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…