షర్మిల ముహూర్తబలం కోసం చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణాలోని వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులతో భేటీలు నిర్వహిస్తున్న షర్మిలకు చాలామంది చాలా సూచనలు చేస్తున్నారట. అంతిమంగా ఎవరు ఏమి చెబుతున్నా పార్టీ ప్రకటనకు ముందుగానే కీలకమైన నేతలను తనతో కలిసి నడిచేందుకు చేయి కలపాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం.
పనిలో పనిగా పార్టీ ప్రకటనకు మంచి ముహూర్తబలాన్ని చూస్తున్నట్లు చెబుతున్నారు. ముందు పాదయాత్ర చేయాలా ? లేకపోతే పార్టీని ప్రకటించాలా అన్న విషయంలోనే షర్మిల కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నట్లు సమాచారం. పార్టీ ప్రకటనకైనా పాదయాత్రకైనా రెండు ముహూర్తాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 8వ తేదీ, మే 14వ తేదీలను సీరియస్ గా పరిశీలిస్తున్నారట.
మే 14వ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆరోజున వైఎస్సార్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక రెండో ముహూర్తం జూలై 8వ తేదీ ప్రత్యేకత ఏమిటంటే ఆరోజు వైఎస్సార్ జయంతి. జయంతి రోజే పార్టీ పేరును ప్రకటిస్తే బాగుంటుందని షర్మిల అనుకుంటున్నారట. అయితే అప్పటికి చాలా ఆలస్యమైపోతుందని కీలక నేతలు చెబుతున్నారట. మే 14వ తేదీన అయితే మొదటిసారి ప్రమాణస్వీకారం చేసిన తేదీనే పార్టీ ప్రకటన చేసినా లేకపోతే పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని చెబుతున్నారట.
పై రెండు తేదీల్లో దేనివైపు మొగ్గు చూపుతారో ఎవరికీ తెలీటం లేదు. ఎందుకంటే షర్మిల అనుకున్న జూలై 8వ తేదీ విషయంలో నేతల్లో కొందరి మధ్య చిన్నపాటి అభ్యంతరాలున్నట్లు సమాచారం. కాబట్టి ఏ విషయం ఇంకా పూర్తిగా తేలలేదు. మొత్తం మీద పై రెండు తేదీలనే షర్మిల సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ఆమె సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on February 16, 2021 11:50 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…