Political News

అస‌లైన యుద్ధం మొద‌లయ్యేది ఇపుడే

ఇపుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల యుద్ధం ఒక ప‌ద్ద‌తి. తొంద‌ర‌లో మొద‌ల‌వ్వ‌బోయే యుద్ధం మ‌రో ప‌ద్ద‌తి. ఇపుడే అస‌లైన ఎన్నిక‌ల యుద్ధం మొద‌ల‌వ్వ‌బోతోంది. పుర‌పాల‌క సంఘాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ వచ్చేసింది. దాదాపు 15 రోజుల క్రితం మొద‌లైన పంచాయితీ ఎన్నిక‌ల్లో పార్టీల గుర్తులు ఉండ‌వ‌న్న విష‌యం తెలిసిందే.

ఎప్పుడైతు గుర్తులు లేవో గెలిచిన వారంతా త‌మ వారే అని అధికార వైసీపీ, కాదు కాదు త‌మకు 38 శాతం పంచాయితీలు వ‌చ్చాయ‌ని ప్ర‌ధాన ప్ర‌తినప‌క్షం తెలుగుదేశంపార్టీ వాదులాడుకుంటున్న విష‌యాన్ని చూస్తున్న‌దే. స‌రే ఈ విష‌య‌న్ని ప‌క్క‌న పెట్టేస్తే తొంద‌ర‌లోనే మొద‌ల‌వ్వ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల మీదే జ‌రుగుతుంది. దాంతో ఏ పార్టీ ఎన్ని ఛైర్మ‌న్ స్ధానాల‌ను గెలుచుకున్న‌ది, వార్డుల‌ను గెలుచుకున్న‌ద‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తుంది.

ఇప్ప‌టిలా రెండుపార్టీలు ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్ళు క్లైం చేసుకునేందుకు ఉండ‌దు. పంచాయితి ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ మ‌ద్ద‌తుదారులు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌టానికి చాలా చోట్ల ఎవ‌రు ముందుకు రాలేదని వైసీపీ అంటోంది. కానీ ఇక్క‌డే గెలిచిన పంచాయితీల మ‌ద్ద‌తుదారుల విష‌యంలో చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెబుతున్నాడ‌ని వాళ్ళు గెలిచింది కేవ‌లం 15 శాతం పంచాయితీల్లోనే అని వైసీపీ నేత‌లంటున్నారు. గెలిచిన త‌మ మ‌ద్ద‌తుదారుల వివ‌రాల‌ను ఫొటోల‌తో స‌హా తాము చూపించగలం అని చంద్ర‌బాబు అంటున్నారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇలాంటి గంద‌ర‌గోళానికి అవ‌కాశం లేదు. వార్డు కౌన్సిల‌ర్ ద‌గ్గ‌ర నుండి ఛైర్మ‌న్ గా పోటీ చేసే వాళ్ళంద‌రు పార్టీల గుర్తుల మీదే పోటీ చేయాలి. కాబ‌ట్టి పార్టీల కెపాసిటి ఏమిటో తేలిపోతుంది. స‌హ‌జంగానే లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్సంటే అధికార‌పార్టీకే అనుకూలంగా ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. కాబ‌ట్టి రేప‌టి ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ త‌న ఆధిక్య‌త‌ను నిరూపించుకుంటుందా? తెలుగుదేశం పై చేయి సాధిస్తుందా? అన్నది తేలనుంది.

This post was last modified on February 15, 2021 2:14 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

54 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago