Political News

బ‌స్సులు, రైళ్లు ఈ నెల‌లోనే తిరుగుతాయ్

క‌రోనా వ్యాప్తిని నివారించేందుకు అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా నెల‌న్న‌ర రోజులుగా ప్ర‌జా ర‌వాణా ఆగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్లు ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో సొంత వాహ‌నాలు పెట్టుకుని.. లేదా ప్ర‌భుత్వమే ఏర్పాటు చేసిన‌ ప్ర‌త్యేక రైళ్లు, బ‌స్సుల ద్వారా స్వ‌స్థ‌లాల‌కు చేరే ప్ర‌య‌త్నం చేశారు. చేస్తున్నారు.

ఐతే ఇంత క‌ష్ట‌ప‌డ‌లేక సాధార‌ణ ప్ర‌జా రవాణా ఎప్పుడు పున‌రుద్ధ‌రిస్తారా అని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ‌ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ శుభ వార్త చెప్పారు. త్వ‌ర‌లోనే ప్ర‌జా రవాణాను మొద‌లుపెట్ట‌డానికి కేంద్రం స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. బ‌హుశా మే నెల‌లోనే బ‌స్సులు, రైళ్ల‌ను పాక్షికంగా అయినా పున‌రుద్ధ‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామ‌ని నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ మార్గదర్శకాలు ఉండబోతున్నాయని చెప్పారు. ఈ మేరకు కారు, బస్సు ఆపరేటర్స్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

రవాణా రంగానికి సంబంధించి వచ్చిన బెయిల్ఔట్‌ ప్యాకేజీ గురించి ప్రస్తావనకు రాగా.. ఈ రంగంలో ఉన్న అన్ని సమస్యలూ తనకు తెలుసని గడ్కరీ అన్నారు. రవాణా రంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా రవాణాకు లండన్‌ మోడల్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులు పునః ప్రారంభయ్యాయని గడ్కరీ తెలిపారు. మే 17న కేంద్రం ప్ర‌క‌టించిన మూడో లాక్ డౌన్ గ‌డువు ముగుస్తుంది. ఆ త‌ర్వాత ప్ర‌జా రవాణా పునఃప్రారంభించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on May 7, 2020 6:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

2 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

3 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

4 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

5 hours ago

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

6 hours ago

టీడీపీపై తెలంగాణకు ఆశ చావలేదు!

అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…

7 hours ago