కొత్త వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడిపై అన్నీ వైపుల నుండి ఒత్తిడి పెరిగిపోతోంది. గడచిన మూడు మాసాలుగా ఢిల్లీ శివార్లలోని మూడు వైపులా వేలాదిమంది రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాల రద్దును మోడి వ్యక్తిగతంగా చాలా ప్రిస్టేజిగా తీసుకున్నారు. ఎట్టిపరిస్ధితుల్లోను చట్టాలను రద్దు చేసేది లేదని ఎప్పటినుండో పట్టుదలగా ఉన్నారు. దాంతో ఢిల్లీ-హర్యానా శివార్లలోని సింఘూ ప్రాంతంలో జరిపిన ఉద్యమం ఫలితంగా చట్టాల అమలును ఏడాదిన్నర వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఏడాదిన్నర కాదని మొత్తానికే రద్దు చేయాలంటున్నారు రైతులు. ఈ నేపధ్యంలోనే జనవరి 26వ తేదీన ఢిల్లీ రోడ్లపై జరిగిన ర్యాలీ ఎంతటి వివాదాస్పదమైందో అందరు చూసిందే. ర్యాలీ వివాదాస్పదమైంది కాబట్టి ఉద్యమం నీరుగారిపోతుందని అనుకున్నారు. అయితే ఉల్టాగా మరింత ఉదృతంగా ఉద్యమం జరుగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇదే సమయంలో చట్టాల రద్దు విషయంలో మోడిపై అన్నీవైపుల నుండి ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలోని 400 మందకి పైగా భారతీయ విద్యావేత్తలు విజ్ఞప్తి చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వ్యవసాయరంగానికి రైతాంగానికి పెనుముప్పుగా తయారవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు, అట్టడుగు వర్గాల కోసం కేంద్రం చట్టాలు చేసేముందు సమాజంలో చర్చలు జరగాలంటూ విద్యావేత్తలు మోడికి సూచించారు. రైతులు వ్యవతిరేకిస్తున్న కొత్త చట్టాలను అమలు చేసే విషయంలో కేంద్రం పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రికి హితవు పలికారు.
నూతన వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ప్రధానికి లేఖ రాసిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటి, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి బెంగుళూరు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కోల్ కత్తా, ముంబాయ్, కోలకత్తా ఐఐటిలతో పాటు విదేశాల్లో పనిచేసే అనేక విశ్వవిద్యాలయల ప్రొఫెసర్లు కూడా సంతకాలు చేశారు. గతనెలలోనే 850 మంది విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు ఇదే విధమైన లేఖను మోడికి పంపారు.
వీరు కాకుండా సెలబ్రిటీలు, ప్రతిపక్షాలు, రైతుకూలీలు, వ్యవసాయ సంఘాలు, అసంఘితరంగంలోని కార్మిక నేతలు కూడా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బలంగా గళం వినిపిస్తున్నారు. అన్నీ వైపుల నుండి ఒత్తిళ్ళు పెరిగిపోతున్న కారణంగానే పార్లమెంటులో వ్యవసాయ చట్టాలపై 15 గంటల చర్చకు మోడి సిద్ధమని ప్రకటించారు. మరి ఇన్ని వైపుల నుండి వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత పెరిగిపోతున్నా చివరకు మోడి ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on February 4, 2021 10:05 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…