సోషల్ మీడియా కాలంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమే. రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు బయట కంటే సోషల్ మీడియాలో ఎక్కువ కొట్టేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవతలి వాళ్ల లొసుగులు ఏ కాస్త దొరికినా వాటి మీద జరిగే నెగెటివ్ ప్రచారం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీ విషయంలో కొన్ని నెలలుగా ఎంతటి విమర్శలు నడుస్తున్నాయో, సోషల్ మీడియాలో ఎంతగా ప్రతికూల ప్రచారం నడుస్తోందో తెలిసిందే.
లాక్ డౌన్ టైంలో మద్యం దుకాణాలు పున:ప్రారంభం కాగానే పేరున్న బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టేసి, మద్యం ధరలు విపరీతంగా పెంచేసి, అనేక లోకల్ బ్రాండ్లతో దుకాణాలను నింపేసింది వైకాపా ప్రభుత్వం. ఎక్కువగా వైకాపా నాయకులే ఈ బ్రాండ్లను ప్రవేశ పెట్టినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందూ కనీ వినీ ఎరుగని విచిత్రమైన పేర్లతో బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి మద్యం దుకాణాల్లో. ‘ప్రెసిడెంట్ మెడల్’ పేరుతో వచ్చిన ఒక బ్రాండ్ మీద ఇప్పటిదాకా ఎన్ని జోకులు పేలాయో లెక్కే లేదు. జగన్ ప్రభుత్వ పనితీరుకు మెచ్చి ‘ప్రెసిడెంట్ మెడల్’ ఇచ్చారంటూ వ్యంగ్యంగా స్పందించారు వైకాపా వ్యతిరేకులు.
ఐతే తాజాగా ‘స్పెషల్ స్టేటస్’ పేరుతో ఓ కొత్త బ్రాండ్ వచ్చినట్లుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గట్టి ప్రచారం నడుస్తోంది. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్.. ఇప్పుడు నిజంగానే ఆ పని చేశాడంటూ ‘స్పెషల్ స్టేటస్’ పేరుతో ఉన్న మద్యం బాటిల్‌ను పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ‘3 క్యాపిటల్స్’ పేరుతోనూ ఒక బ్రాండ్ కనిపిస్తోంది. దాని మీదా జోకులు పేలుతున్నాయి.
ఐతే నిజంగా ఈ బ్రాండ్లన్నీ మార్కెట్లోకి వచ్చాయా లేక వైకాపా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మార్ఫింగ్ చేసిన ఫొటోలను వదులుతున్నారా అన్నది అర్థం కావడం లేదు. ఒకవేళ నిజంగా ఈ పేరుతో బ్రాండ్లను తీసుకొస్తుంటే మాత్రం అవి ప్రభుత్వానికి చాలా డ్యామేజింగ్‌గా మారతాయి కాబట్టి వైకాపా నాయకులు కొంచెం అప్రమత్తం కావాల్సిందే.
This post was last modified on February 2, 2021 3:28 pm
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…