వారం క్రితం.. తన పత్రికలో తాను స్వయంగా రాసిన రాజకీయ వార్తతో సంచలనంగా మారారు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరీమణి షర్మిల తెలంగాణలో వైఎస్ తెలంగాణ పార్టీ పెట్టబోతుందని.. కుమార్తెకు అండగా తల్లి విజయమ్మ నిలవనుందన్న రాజకీయ విశ్లేషణ హాట్ టాపిక్ గా మారింది. ప్రతి వీకెండ్ లో తాను రాసే వీకెండ్ కామెంట్ ను పత్రిక నాలుగో పేజీలో రాసుకుంటారు. ఏదైనా ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు మొదటి పేజీలో దానికి సంబంధించిన కొన్ని వివరాలు వేసి.. నాలుగో పేజీలో మొత్తం సమాచారం ఉందంటూ ఇండికేషన్ ఇస్తుంటారు.
అందుకు బదులుగా.. షర్మిల కొత్త పార్టీ విశ్లేషణకు సంబంధించిన కథనాన్ని బ్యానర్ వార్తగా.. ఎనిమిది కాలమ్స్ లో రాసి అచ్చేయించారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. నాలుగో పేజీలో ఏవైతే అంశాలు ఉంటాయో.. వాటినే మధ్య మధ్యలో కట్ చేసి.. పేరాల మాదిరి మొదటిపేజీలో అచ్చేవారు. వాస్తవానికి ఇలాంటి ప్రయోగం ఇప్పటివరకు ఏ ప్రముఖ దినపత్రికలోనూ జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఒకే వార్త (విశ్లేషణ)ను మొదటి పేజీలో.. నాలుగో పేజీలో కాస్త భిన్నమైన మేకప్ తో రెండుసార్లు (మొత్తం కాకున్నా.. చాలా భాగం) వేయటం చాలా.. చాలా అరుదు.
అందులోని అంశాల్ని రెండు రోజుల తర్వాత షర్మిల ఒక ప్రకటన జారీ చేసి ఖండించారు. అసత్యాలని పేర్కొంటూ.. నీతిమాలిన చర్యకు పాల్పడ్డారంటూ షర్మిల సంతకంతో వచ్చిన నోట్ లో ఘాటైన పదజాలాన్ని వాడారు. దానికి సమాధానంగా ఈ రోజు (ఆదివారం) రాసిన విశ్లేషణలో సూటి సవాలును విసిరారు. తనను ఉద్దేశించి అన్న మాటను షర్మిల నేరుగా అనలేదన్న భావనను ఆర్కే ఇస్తూ.. అయిష్ఠంగా ఆమె సంతకం పెట్టినట్లుగా పేర్కొనటం గమనార్హం.
ఇంతకీ ఆర్కే విసిరిన సవాలు ఏమిటి? షర్మిల నోట్ కు ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటన్నది ఆయన మాటల్ని యథాతధంగా చూస్తే..
”గతవారం నేను రాసిన కొత్త పలుకును పాక్షికంగా ఖండిస్తూ వైఎస్ షర్మిల ఒక ప్రకటన జారీ చేశారని జగన్ మీడియాలో ప్రచురించారు. ఒక కుటుంబానికి సంబంధించి వార్తలు రాయడం నీతిమాలిన చర్య అని కూడా ఆక్షేపించారు. నిజానికి నేను చెప్పిన అనేక అంశాలను షర్మిల ఖండించలేదు. ఎవరో తయారు చేసిన ప్రకటనపై షర్మిల అయిష్టంగా సంతకం చేసినట్టుగా ఆ ప్రకటనను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది”
”శ్రీమతి విజయలక్ష్మి బెంగళూరులో ఉన్న షర్మిల వద్దకు హుటాహుటిన ఎందుకు వెళ్లారు? పులివెందుల నుంచి ఎవరెవరు బెంగళూరు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? ఏ పరిస్థితులలో ఆ ప్రకటనపై షర్మిల సంతకం చేసిందీ నాకు తెలియదనుకుంటున్నారా?”
”అయినా, కుటుంబ వ్యవహారాల గురించి రాయడం నీతిమాలిన చర్య అన్న పక్షంలో ఒకప్పుడు రామోజీరావుతో విభేదించిన ఆయన చిన్న కుమారుడు దివంగత సుమన్‌తో ఇంటర్వ్యూ చేసి రామోజీరావును తిట్టించిన జగన్మోహన్ రెడ్డి కూడా నీతిమాలిన చర్యకు పాల్పడినట్టే కదా!”
”జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయనది ప్రైవేటు కుటుంబం కాదు. షర్మిల కూడా వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారి మధ్య విభేదాలు ఏర్పడితే అది వార్త కాకుండా పోదు”
”రామోజీరావు ప్రజాజీవితంలో లేకపోయినా ఆయన కుటుంబాన్ని బజారుకు ఈడ్చిన వాళ్లు నీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే! అయినా నేను రాసినవి అసత్యాలని అటు శ్రీమతి విజయలక్ష్మి గానీ, ఇటు షర్మిల గానీ బైబిల్ పట్టుకుని చెప్పగలరా? అలా చెప్పిన రోజు నేను బహిరంగంగా క్షమాపణ చెబుతాను”
This post was last modified on January 31, 2021 12:50 pm
అదేంటో గానీ…జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమమూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. ఏదో సినిమా…
ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి బహిరంగ వేదికపై స్వల్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మాటలు చెప్పొద్దు.. చేతలకు రండి!' అని…
భారత్ను ఢీ కొంటామని.. తగిన విధంగా బుద్ది చెబుతామని బీరాలు పలికిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చుట్టూ…
హిట్ 3 ది థర్డ్ కేస్ మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ దాటేసి విజయవంతంగా రెండో వారంలోకి అడుగు…
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…