ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఇటీవల గణతంత్ర వేడుకలు(బీటింగ్ రిట్రీట్) నిర్వహించిన రాజ్‌పథ్‌కు 1.4 కిలో మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పైగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంవద్ద ఈ పేలుడు సంభవించింది. ఓ పూల కుండీలో ఏర్పాటు చేసిన ఐఈడీ పేలుడు సంభవించడంతో భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ పేలుడు ధాటికి కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సాయంత్రం 5గంటల 5 నిముషాల సమయంలో సంభవించిన ఈ పేలుడు స్థానికంగానే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది.
పేలుడు ఘటన తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగిపోయారు. బాంబు నిర్వీర్య దళంతోపాటు.. ఎన్ ఎస్ జీ కమెండోలు, పోలీసులు భారీ ఎత్తున ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే.. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గుర్తించారు. అయితే.. సమీపంలో ఉన్న కార్ల అద్దాలు ధ్వంసం కావడం, కొన్ని కార్లకు టైర్లు పేలిపోవడం జరిగిందన్నారు. ఈ పేలుడు ఘటనతో ఢిల్లీలోని అన్ని రాయబార కార్యాలయాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయబార కార్యాలయానికి దారితీసే అన్ని రహదారులను భద్రతా దళాలు మూసివేశాయి.
ఇక, పేలుడు వెనుక ఉగ్రమూకల హస్తమేదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఘటనా ప్రాంతాన్ని స్పెషల్ టీం పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇక, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశ నిఘా విభాగం అలెర్టయింది. దేశంలో ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే.. అప్పట్లో ఏమీ జరగలేదు. కానీ, అనూహ్యంగా ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన ఈ పేలుడు సంచలనం సృష్టించింది. మరి దీని వెనుక ఎవరున్నారు? అనే విషయంపై అధికారులు అప్పుడే దర్యాప్తు ముమ్మరం చేశారు.
This post was last modified on January 29, 2021 7:25 pm
ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన…
2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230…
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…