Political News

హెల్ప్ చేయండి మేడం… నిర్మలమ్మకు చంద్ర‌బాబు విన‌తి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌తో ఆయ‌న భేటీ అయ్యారు. సుమారు గంట‌న్న‌ర పాటు ఆమెతో చ‌ర్చించిన ఆయ‌న‌.. ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ప్ర‌స్తుతం వ‌రుస తుఫాన్ల కార‌ణంగా సంభ‌వించిన న‌ష్టాల‌పై ఆయ‌న ఫొటోల‌తో స‌హా వివ‌రించారు. ఇప్ప‌టికే న‌ష్ట‌పోయిన రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నార‌ని తెలిపిన ఆయన‌.. కేంద్రం త‌క్ష‌ణ‌మే త‌మ‌ను ఆదుకోవాల‌ని అన్నారు. రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

వరుస తుపాన్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన సాధార‌ణ ప్ర‌జ‌లు, రైతుల‌ను ఆదుకోవాలని, కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని చంద్ర‌బాబు కోరారు. తుపాను నష్టాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాల్సి ఉంద‌న్నారు. ఇటీవల రాష్ట్రంపై విరుచుకుపడిన అర్నబ్, మురసు తుపాన్లు విరుచుకుప‌డ్డాయ‌ని దీంతో ఉభ‌య గోదావ‌రి, బాప‌ట్ల‌, ఎన్టీఆర్‌, ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయ‌ని వివ‌రించారు. ఈ భారీ నష్టాలకు సంబంధించిన ఫొటోలు, ఆధారాల‌ను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు ఇచ్చారు. నష్టానికి సంబంధించిన అంచనా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించిందన్నారు.

అదేస‌య‌మంలో ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో తలెత్తిన తీవ్ర సవాళ్లు, కరువు పరిస్థితులను కూడా చంద్ర‌బాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాయ‌ల‌సీమ స‌హా ప‌లు జిల్లాల్లో క‌రువు నెల‌కొంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో పూర్వోదయ పథకం కింద ప్రతిష్టాత్మకమైన రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు త‌గిన‌ ప్రతిపాదనలను వేగంగా ఆమోదించాల‌ని కేంద్రాన్ని కోరారు. అలానే.. దీనికి సంబంధించి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మద్దతు ఇవ్వాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని నిర్మ‌లా సీతారామ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

కేంద్ర బృందం నివేదిక‌..

కేంద్ర బృందం నివేదిక ఇంకా రాలేద‌ని.. దీనిపై కేబినెట్ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ సీఎం చంద్ర‌బాబుకు చెప్పిన‌ట్టు తెలిసింది. తుఫాను ప్ర‌భావిత రాష్ట్రాల్లో కేంద్రం నుంచి వ‌చ్చిన బృందాలు అధ్య‌య‌నం చేశాయ‌న్నారు. అలానే ఏపీలోనూ కేంద్ర బృందాలు అధ్య‌య‌నం చేశాయ‌ని, క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి స‌మ‌స్య‌లు, న‌ష్టాల‌ను అంచ‌నా వేశాయ‌ని వివ‌రించారు. ఈ బృందం నివేదిక ఇంకా అంద‌లేద‌ని చెప్పారు. ఈనివేదిక అందిన త‌ర్వాత‌.. కేబినెట్‌లో చ‌ర్చించి.. సాయం అందిస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ భ‌రోసా ఇచ్చారు. అప్ప‌టి వ‌ర‌కు త‌క్ష‌ణ సాయంగా విప‌త్తుల‌కు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను వినియోగించుకునే వెసులుబాటు క‌ల్పించామ‌న్నారు. 

This post was last modified on November 17, 2026 6:56 pm

Share

Recent Posts

కీల‌క నిర్ణ‌యం.. కార్య‌క‌ర్త‌లు ఖుషీ ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా చెబుతున్న `కార్య‌క‌ర్తే నాయ‌కుడు` అనే మాట‌ను తాజాగా రుజువు చేశారు. ఎన్నో…

16 minutes ago

జగన్ సైతాన్ సైన్యానికి పచ్చ రోగం తగ్గలేదు: షర్మిల

తమ ప్రత్యర్థి అయితే చాలు...టార్గెట్ చేయడం, వ్యక్తిత్వహననానికి పాల్పడడం వైసీపీ నేతలకు అలవాటే. నిండు శాసన సభలో అప్పటి ప్రతిపక్ష…

48 minutes ago

నాగవంశీ మాటల వెనుక మర్మమేమిటో

జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ గురించి అభిమానులు, సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతూనే…

2 hours ago

గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఆ రెస్టారెంట్ కు వెళ్ళిన రాహుల్ గాంధీ

రాజకీయ బాధ్యతల వల్ల పెళ్లి చేసుకోలేదని పలు సందర్భాల్లో సరదాగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడొక రహస్యాన్ని…

2 hours ago

కర్నూలులో ప్రధాని మోదీ తల్లికి ఆలయం

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దశాబ్దకాలంగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. భారతదేశానికి…

4 hours ago

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్… చెక్ ఎప్పుడు?

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. తాడివారి మెరక వద్ద ఓఎన్‌జీసీ…

5 hours ago