తమ ప్రత్యర్థి అయితే చాలు…టార్గెట్ చేయడం, వ్యక్తిత్వహననానికి పాల్పడడం వైసీపీ నేతలకు అలవాటే. నిండు శాసన సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించారు వైసీపీ సభ్యులు. ఇక, జగన్ కు వ్యతిరేకంగా రాజకీయ విమర్శలు చేసిన షర్మిలను కూడా వదల్లేదు వైసీపీ మూకలు.
జగన్ ది సైతాన్ సైన్యం అని షర్మిల గతంలో విమర్శించారు. సీఎం చంద్రబాబుకు తన కుమారుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్లిన షర్మిలను దూషించిన ఘనత వైసీపీ సైకో సైన్యానిది. ఇప్పుడు కూడా తన కూతురు అంజిలి పెళ్లి పత్రిక అందించేందుకు చంద్రబాబును కలిసిన షర్మిలపై వైసీపీ మూకలు దుర్భాషలాడుతున్న వైనంపై షర్మిల నిప్పులు చెరిగారు.
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? అంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై షర్మిల ఫైర్ అయ్యారు. వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? అంటూ షర్మిల ఉగ్రరూపం దాల్చారు.
చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక ఇచ్చిన తనపై సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరమని ఆమె మండిపడ్డారు. తనకు, తన కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం అని, వైసీపీ అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ గారికి, ఆయన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదని, మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదని మండిపడ్డారు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని వారు మరవలేదని, వారి మానసిక స్థితి మెరుగుపడలేదని ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం సాక్షికి మాత్రమే చెల్లిందని గడ్డిపెట్టారు.
సాక్షి ఎంత కలుషితమైందో, వాళ్ల మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉందని ఎద్దేవా చేశారు. తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని వైఎస్సార్ గారు ఆహ్వానించారని, ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా? అని ప్రశ్నించారు.
‘‘తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి’’ అని జగన్ ను షర్మిల నిలదీశారు. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలని జగన్ కు సవాల్ విసిరారు.
This post was last modified on November 17, 2026 6:09 pm
జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ గురించి అభిమానులు, సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతూనే…
రాజకీయ బాధ్యతల వల్ల పెళ్లి చేసుకోలేదని పలు సందర్భాల్లో సరదాగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడొక రహస్యాన్ని…
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దశాబ్దకాలంగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. భారతదేశానికి…
అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. తాడివారి మెరక వద్ద ఓఎన్జీసీ…
భారత పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాటా గ్రూప్‌లో ఇప్పుడు పాలనా వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. సంస్థను ఎవరు…
విశ్వంభర థియేటర్ హక్కులు మైత్రి సంస్థ కొన్నదని నిన్నంతా ప్రచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఆర్టిస్టు ప్రవీణ్ తాను…