“దాదాపు 17 ఏళ్లకుపైగానే దోషులు జైల్లో ఉన్నారు. ఇక, చాలు. వారిని ఇంటికి పంపేయొచ్చు.“ అని 2002 నాటి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంచలనంగా మారింది. సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న కారణంగా బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసింది. విపిన్‌చంద్ర కన్హయ్యలాల్ జోషి, ప్రదీప్ రమణ్‌లాల్ మోధియా అనే ఇద్దరు దోషుల జీవిత ఖైదును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ కేసులో దోషులుగా తేలిన ఇద్దరు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా కారాగార శిక్షను అనుభవించారని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దోషుల్లో ఒకరైన విపిన్‌చంద్ర జోషి తీవ్రమైన శారీరక వైకల్యంతో బాధపడుతున్న విషయాన్ని ధర్మాసనం గమనించింది. 2017లో బాంబే హైకోర్టు విధించిన జీవిత ఖైదు తీర్పును సవాలు చేస్తూ వీరిద్దరూ దాఖలు చేసిన అప్పీలులో వాస్తవ, చట్టపరమైన అంశాలను ఇంకా లోతుగా పరిశీలించాల్సి ఉందని న్యాయస్థానం పేర్కొంది. సంబంధిత విచారణ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి వీరికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
దేశాన్ని కుదిపేసిన కేసు!
2002లో గుజరాత్ లో చెలరేగిన అల్లర్ల సమయంలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరగడంతో పాటు, ఆమె కుటుంబంలోని ఏడుగురు హత్యకు గురయ్యారు. ఈ కేసులో దోషులుగా తేలిన 11 మందికి బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది. చిత్రం ఏంటంటే.. గుజరాత్‌లో అయితే తమకు న్యాయం జరగదని బాధిత కుటుంబీకుల పక్షాన దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు అప్పట్లో ఈ కేసును బాంబే హైకోర్టుకు బదిలీ చేసింది. దీనిని విచారించిన కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. అయితే.. 2022లో గుజరాత్ ప్రభుత్వం ముందస్తు విడుదల చేసింది. ఇది అప్పట్లో పెను వివాదానికి దారితీసింది.
రేప్ కేసు నిందితులను బయటకు వదలడం, దోషులకు బీజేపీ నాయకులు పూల దండలు వేసి ఊరేగింపుగా తీసుకువెళ్లడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2024 జనవరిలో సుప్రీంకోర్టు దీనిని విచారించి.. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో దోషులందరూ తిరిగి లొంగిపోయి జైలుకు వెళ్లారు. అనంతరం.. వీరిలో ఇద్దరు దోషులు అప్పీల్ చేసుకోగా.. తాజాగా వారికి బెయిల్ ఇవ్వడం గమనార్హం.
This post was last modified on November 16, 2026 10:23 pm
సీనియర్ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో కనిపించబోతున్నారు. ఆ…
తెలుగు సంగీత ప్రపంచంలో సినిమా పాటలకే కాదు.. జానపద గీతాలకు కూడా భారీ ఆదరణ లభిస్తోందని మరోసారి ప్రూవ్ అయ్యింది.…
తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ బడ్జెట్ లో అత్యధిక రిటర్న్స్ తెచ్చిపెట్టగల దర్శకులు ఎవరయ్యా అంటే టాలీవుడ్ మొత్తం…
తెలుగు, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మిర్నాళిని రవి పెళ్లి చేసుకుంది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు…
ప్రజలు కోరుకుంటున్నారన్న కారణంగా ఒక ప్రాంతాన్ని ఒక వర్గానికి రిజర్వ్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక…
అనుకుంటాం కానీ తమ సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు హీరోల చేతుల్లో ఉండవు. ఎవరిదాకో ఎందుకు మెగాస్టార్ అంతటి వారే…