ప్రజలు కోరుకుంటున్నారన్న కారణంగా ఒక ప్రాంతాన్ని ఒక వర్గానికి రిజర్వ్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నిక అయినా.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలైనా ప్రజల డిమాండ్లను చూపించి ఆయా ప్రాంతాలను రిజర్వేషన్ కేటగిరీలోకి తీసుకురాలేరని స్పష్టం చేసింది. ఒక ప్రాంతంలో ఏ వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారు? వారికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? లేదా? ఆ వర్గానికి పాలన, అధికారం పరంగా ఎన్నికల ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉందా? లేదా? అనే నిర్ణయం ప్రజల చేతుల్లో లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈక్రమంలో ఒక ప్రాంతాన్ని తమకు రిజర్వ్ చేయాలని కోరే అవకాశం, హక్కులు లేవంది.
విషయం ఏంటి?
మహారాష్ట్రలో గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గడ్చిరౌలి జిల్లాలో ఒక ప్రాంతాన్ని తమ వర్గానికి రిజర్వ్ చేయాలని ఎస్టీలు కోరారు. అయితే.. అది ఎస్సీలకు కేటాయించారని.. కాబట్టి అలా చేయడం కుదరని ఎస్సీలు పట్టుబట్టారు.అయితే.. స్థానిక ఎన్నికల సమయంలో రొటేషన్ ప్రాతిపదికన ప్రతి ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్ మార్చుకునే అవకాశం ఉందని ఎస్టీలు కోరారు. ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ వ్యవహారం చివరకు బాంబే హైకోర్టుకు చేరింది. దీనిని విచారించిన కోర్టు.. రొటేషన్ ప్రాతిపదికన ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే అంతిమమని తీర్పు చెప్పింది.
ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సమగ్ర విచారణ చేసిన సుప్రీంకోర్టు.. ఒక ప్రాంతానికి తమ వర్గానికి రిజర్వ్ చేయాలని కోరే హక్కు ప్రజలకు లేదని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు.. ఏ వర్గానికి అన్యాయం జరిగిందో తెలుసుకుని.. ఆ వర్గ ప్రజల సంఖ్యను, వారి అభిప్రాయాలను కూడా చూసుకుని ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయానికి ప్రజలుకట్టుబడాలని స్పష్టం చేసింది. “తమ నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కావాలనే హక్కు ఎవరికీ లేదు. రిజర్వేషన్ల రొటేషన్ విధానం పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారమే.“ అని పేర్కొన్న సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది.
రిజర్వేషన్‌పై..
సాధారణ రిజర్వేషన్లకు.. ఎన్నికల రిజర్వేషన్‌కు తేడా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో వెనుకబడిన వర్గాలకు కొంత ఊతం ఇచ్చేందుకు మాత్రమే రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని.. ఇది హక్కుగా దఖలు పడదని పేర్కొంది. ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కూడా.. సమాజంలో ఉన్నత స్థితికి చేరుకున్నాయని ప్రభుత్వం భావిస్తే.. వారికంటే వెనుక బడిన వర్గాలకు రిజర్వేషన్ వర్తింప చేయొచ్చని గతంలో ఇచ్చిన తీర్పును ఉటంకించింది. ఇక, ఎన్నికల విషయంలో రిజర్వేషన్ అనేది ప్రభుత్వ సంపూర్ణ హక్కుగా ఉంటుందని పేర్కొంది.
This post was last modified on November 16, 2026 7:32 pm
అనుకుంటాం కానీ తమ సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు హీరోల చేతుల్లో ఉండవు. ఎవరిదాకో ఎందుకు మెగాస్టార్ అంతటి వారే…
ఎన్నికలు ఏవైనా డబ్బులతోనే ముడి పడి ఉంటున్నాయి. సొమ్ములు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు నాయకులు, తీసుకునేందుకు ఓటర్లు కూడా ఎక్కడా…
టాలీవుడ్లో చాలామంది హీరోలకు సొంత బేనర్లు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యులనో, దగ్గరి మిత్రులనో పెట్టి ఆ బేనర్లను నడిపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే…
శాండల్ వుడ్ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇంతకు ముందు మన ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు…
2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి గెలుపు తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు…
వారణాసి అప్డేట్స్ కావాలని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్న వైనం ఈ మధ్య పెరిగింది. ఏప్రిల్…