Movie News

రావిపూడి రేంజ్ ఏమిటో అర్థమయ్యిందిగా

తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ బడ్జెట్ లో అత్యధిక రిటర్న్స్ తెచ్చిపెట్టగల దర్శకులు ఎవరయ్యా అంటే టాలీవుడ్ మొత్తం వినిపించే ఒకే ఒక్క పేరు అనిల్ రావిపూడి. చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు తీసినా, వెంకటేష్ తో ఏకంగా అయిదు సినిమాలు చేసినా తన వేగం ఎప్పుడూ తగ్గదు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుని ఆరు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలిపి హిట్టు కొట్టడం అభిమానులు అంత సులభంగా మర్చిపోయేది కాదు. అందుకే తన కోసం నిర్మాతలు పోటీ పడుతుంటారు.

ఇప్పటిదాకా అనిల్ ఎక్కువగా సీనియర్ హీరోలనే హ్యాండిల్ చేశారు. డెబ్యూ మూవీని కళ్యాణ్ రామ్ తో చేసినప్పటికీ ఆ తర్వాత వరసగా రవితేజ నుంచి మెగాస్టార్ దాకా అందరూ నిన్నటి తరం బ్యాచే. ఇకపై జరిగే లైనప్ లో బాలకృష్ణ, చిరంజీవి – నాగార్జున ఉన్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మొన్న హఠాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ కాంబోని ప్రకటించడం ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అప్పటిదాకా ఎలాంటి లీకులకు దొరకని న్యూస్ ఇది.

కేవలం సీనియర్ హీరోలే రావిపూడితో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారన్న కామెంట్స్ కి బ్రేక్ వేస్తూ తారక్ ని ఒప్పించడం చిన్న విషయం కాదు. దీనికి శ్రీకారం జనవరి 12 విడుదల షూటింగ్ టైంలో జరిగిందని ఇన్ సైడ్ టాక్. ఈ సినిమా చేస్తున్నప్పుడు అనిల్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కి సరిపోయే కథ ఉందని గుర్తించిన కళ్యాణ్ రామ్, వెంటనే చొరవ తీసుకుని అదుర్స్ లాంటి ఎంటర్ టైనర్ కోసం వెయిట్ చేస్తున్న తమ్ముడికి కబురు పంపించి ఈ కలయిక సాధ్యం చేసాడని వినికిడి.

ఏదైతేనేం డ్రాగన్ తరహా సీరియస్ యాక్షన్ మూవీ తర్వాత ఇలాంటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు చాలా అవసరం. పైగా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి రిస్క్ ఫాక్టర్ పెద్దగా ఉండదు. డ్రాగన్ 2 కన్నా ముందు ఇది రిలీజ్ చేస్తే ప్రేక్షకుల కోణంలో తనకు కొంత రిలీఫ్ దక్కుతుందనే ఆలోచనలో ఉన్నాడని తెలిసింది. అయితే 2028 సంక్రాంతికి వస్తుందా లేక భగవంత్ కేసరి లాగా సంక్రాంతి సెంటిమెంట్ పక్కన పెట్టి వేరే నెలలో అనిల్ రావిపూడి విడుదల ప్లాన్ చేసుకుంటాడానేది కాలమే సమాధానం చెప్పాలి. 

This post was last modified on November 16, 2026 9:52 pm

Share

Recent Posts

ఫొటోలు: ఆధ్యాత్మిక గురువుతో సౌత్ హీరోయిన్

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మిర్నాళిని రవి పెళ్లి చేసుకుంది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు…

57 minutes ago

ప్ర‌జ‌లు కోరుకున్నార‌ని `రిజ‌ర్వేష‌న్లు`  ఇవ్వ‌రు!

ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్న కార‌ణంగా ఒక ప్రాంతాన్ని ఒక వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేయ‌డం సాధ్యం కాద‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక…

2 hours ago

నిఖిల్ ఎదురుచూపులకు బ్రేక్ ఎప్పుడు

అనుకుంటాం కానీ తమ సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు హీరోల చేతుల్లో ఉండవు. ఎవరిదాకో ఎందుకు మెగాస్టార్ అంతటి వారే…

3 hours ago

`నా ఓటును అమ్ముకోను`… బ్యాలెట్ బ్యాక్స్‌లో 500 నోట్లు-చీటీ!

ఎన్నిక‌లు ఏవైనా డ‌బ్బుల‌తోనే ముడి ప‌డి ఉంటున్నాయి. సొమ్ములు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు నాయ‌కులు, తీసుకునేందుకు ఓట‌ర్లు కూడా ఎక్క‌డా…

3 hours ago

మెగా ఫ్యామిలీలో కొత్త ‘కుంపటి’

టాలీవుడ్లో చాలామంది హీరోలకు సొంత బేనర్లు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యులనో, దగ్గరి మిత్రులనో పెట్టి ఆ బేనర్లను నడిపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే…

3 hours ago

నాగార్జున రూటులో శివరాజ్ కుమార్

శాండల్ వుడ్ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇంతకు ముందు మన ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు…

4 hours ago