Political News

`క‌రువు`లో ఉన్నాం.. 30 వేల కోట్లివ్వండి

తెలంగాణ రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావం, కరువు పరిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్రాన్ని, రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి తక్షణమే 30 వేల కోట్ల రూపాయ‌లు ఆర్థిక సాయం అందించాలని ప్ర‌ధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరిలతో కలిసి ప్రధానమంత్రితో ఆదివారం ఆయ‌న‌ భేటీ అయ్యారు. ప్రధాని నివాసం లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, నిధుల కేటాయింపు, కరువు పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు.

సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వాల‌ని సీఎం కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర అనుమతులు, సమ్మక్క-సారక్క బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ ఎన్‌వోసీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అనుమతులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. గోదావరి-కావేరి అనుసంధానంలో తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలని, కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల రుణాలను పునర్వ్యవస్థీకరించాలని వినతిపత్రం సమర్పించారు.

అలాగే, విద్యుత్, ఎరువులు, రుణ పరిమితి అంశాల‌ను కూడా చ‌ర్చించారు. రాష్ట్ర అవసరాల కోసం అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్, తగినన్ని ఎరువులు కేటాయించాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.  డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని మోడీని సాదరంగా ఆహ్వానించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు రుణ అనుమతులపై కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆయా అంశాల‌ను సానుకూలంగా విన్న ప్ర‌ధాని.. అన్నింటికీ చిరున‌వ్వు న‌వ్వారు. సుమారు 45 నిమిషాల పాటు జ‌రిగిన ఈ భేటీలో ఎక్క‌డా ఎలాంటి హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం లేదు. అయితే.. ప్ర‌ధానికి తమ బాధ్య‌త‌గా కొన్ని స‌మ‌స్య‌లు వివ‌రిస్తామ‌ని.. వాటిని ప‌రిష్క‌రించ‌డం.. ప్ర‌ధానిగా ఆయ‌న బాధ్య‌త అని మంత్రులు వ్యాఖ్యానించారు.

This post was last modified on November 16, 2026 6:24 am

Share

Recent Posts

చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం

తిరుమల అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రంలో…

2 hours ago

వైసీపీ ట్రాప్‌.. చిక్కుకుపోయిన టీడీపీ..?

రాష్ట్ర వ్యాప్తంగా కాదుకానీ.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో వైసీపీ స్థానిక నేత‌లు ప‌న్నిన వ్యూహానికి టీడీపీ…

4 hours ago

అస‌దుద్దీన్ నేతృత్వంలో కొత్త `కూట‌మి`

దేశంలో ప్ర‌స్తుతం జాతీయ స్థాయిలో రెండు కూట‌ములు కొన‌సాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోనిఎన్డీయే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో `ఇండియా` కూట‌ములు ఉన్నాయి.…

6 hours ago

కాకినాడ‌, శ్రీకాకుళంపై పట్టు వదలని పవన్!

ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మిగిలిపోయిన కార్పొరేష‌న్ స్థానాల‌కు, అలానే మునిసిపాలిటీల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో…

8 hours ago

బాబు నివాసానికి షర్మిల… వివాహ ఆహ్వానం కోసమే కాదు!

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం ష‌ర్మిల‌.. హైద‌రాబాద్‌లోని…

9 hours ago

ఆమె వ‌ద్ద‌ని.. ఆమెతోనే రెండు సినిమాల‌కు కాంట్రాక్ట్

వ‌చ్చే శుక్ర‌వారం ద‌క్షిణాదిన మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కాబోతున్న సినిమా.. ఆకాశంలో ఒక తార‌. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా…

10 hours ago