దేశంలో నిన్న మొన్నటి వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్), కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా అంశాలు దుమారం రేపాయి. ఇక, ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. దీనికి ఒక్కొక్కరుగా మద్దతు పలుకుతుండడం.. చూస్తే.. త్వరలోనే ఇది పెను దుమారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఫోన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్యాప్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వివాదం మళ్లీ రాజుకుంది.
ఈ అంశంపై అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుండగా, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్(పీకే) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ దుమారాన్ని మరింత పెంచాయి. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తన వద్ద ఉన్న ఆధారాలన్నీ తన ఫోన్‌లో ఉన్నాయని, ఆ ఫోన్‌ను ప్రధాని ట్యాప్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తనను మాట్లాడనివ్వడం లేదని, అందుకే ప్రధానిని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నట్లు ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రశాంత్ కిశోర్, భారత్‌లో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కఠోర వాస్తవమని అన్నారు. గతంలో ‘పెగాసస్’ నిఘా వివాదం సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తెలిసిందని ఆయన గుర్తు చేశారు. ఇక, ఈ వివాదానికి ఇతర ప్రతిపక్షాల నేతలు కూడా కలిసి వచ్చారు. సమాజ్‌వా దీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ ఆరోపణలకు మద్దతుగా నిలిచారు. సాంకేతిక నిఘాపై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ కౌంటర్
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై రాహుల్ గాంధీ చేస్తున్నవి నిరాధార ఆరోపణలని బీజేపీ దుయ్యబట్టింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ‘హిట్ అండ్ రన్’ రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించింది. పార్లమెంట్‌లో చర్చకు రావాలని సవాల్ రువ్వింది. వార్తల్లో నిలిచేందుకే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. నిజంగా ఆధారాలు ఉంటే వాటిని పార్లమెంట్‌లో లేదా పోలీసులకు సమర్పించాలని వారు డిమాండ్ చేశారు.
This post was last modified on November 14, 2026 1:30 pm
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ తన దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 డిసెంబర్ లో ఆమె…
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న సంగతి తెలిసిందే. ఆమె నటిగా సత్తా చాటుకుంది.…
రోజూ ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌లో నోటిఫికేషన్లు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే…
ఈ నెల నవంబర్ 20 విడుదల కాబోతున్న ఓమ్ మీద మూవీ లవర్స్ లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. పేరుకు తమిళ…
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియాలో ఊహించని పరిస్థితి నెలకొంది. కంపెనీని 33 ఏళ్ల పాటు నడిపించిన జెన్సన్…
వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుండగా టీమ్ఇండియాకు ఓ సమస్య పెద్ద తలనొప్పిగా మారుతోంది. స్వదేశంలో భారీ స్కోర్లు…